భారతీయులు ఎక్కువగా ఇష్టపడుతున్న స్మార్ట్‌ఫోన్‌

Xiaomi Is The Most Preferred Brand In India - Sakshi

ముంబై : స్మార్ట్‌ఫోన్‌ల యుగంలో రోజుకోక కొత్త ఫీచర్‌ వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో మార్కెట్‌ పోటీని తట్టుకునేందుకు ప్రతి కంపెనీ కొత్త ఫీచర్లతో నెలకొక స్టార్మ్‌ఫోన్‌ని లాంచ్‌ చేస్తోంది. వీటిలో కొన్ని హై బడ్జెట్‌ ఫోన్‌లు కాగా మరి కొన్ని మాత్రం సామాన్యులకు అందుబాటులో ఎక్కువ ఫీచర్స్‌తో.. తక్కువ ధరలోనే వస్తున్నాయి. ఈ ‍క్రమంలో స్మార్ట్‌ఫోన్‌ కొనాలనుకునే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు.. అన్ని ఫీచర్లతో బడ్జెట్‌ ధరలో అంటే 10 - 15 వేల రూపాయల మధ్య లభించే స్మార్ట్‌ఫోన్‌కే తమ ఓటు అంటున్నట్లు సర్వేలు వెల్లడిస్తుతున్నాయి. మధ్యస్థాయి వినియోగదారుల మోస్ట్‌ ప్రిఫరబుల్‌ బ్రాండ్‌గా షావోమీ ఫోన్లు ముందు వరుసలో నిలిచాయంటున్నారు నిపుణులు. ‘కన్జ్యూమర్‌ లెన్స్‌’ నిర్వహించిన సర్వేలో ‘షావోమీ’ భారతీయుల మోస్ట్‌ ప్రిఫరబుల్‌ బ్రాండ్‌గా నిలిచింది. తరువాతి వరుసలో శాంసంగ్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్‌లున్నాయి.
 

ఎక్కువ మంది మొదటిసారి కొన్న స్మార్ట్‌ఫోన్‌తో పోలిస్తే.. రెండోసారి, మూడోసారి మాత్రం ఎక్కువ అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను కోనేందుకు ఇష్టపడుతున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. అయితే స్మార్ట్‌ఫోన్‌లు వాడుతున్న ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు హై ఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలనుకుంటుండగా.. ఐదుగురిలో నలుగరు ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌తోనే అడ్జస్ట్‌ అవుతున్నట్లు ఈ సర్వేలో తెలిసింది.  అంతేకాక 25 - 40 వేల రూపాయల మధ్య ఫోన్‌ కొనాలని భావించే వాళ్లు ఎక్కువగా వన్‌ప్లస్‌  బ్రాండ్‌ను ప్రిఫర్‌ చేస్తున్నట్లు తెలిసింది.  ఒప్పో, వివో, ఆపిల్‌, హనర్‌ వంటి హై బడ్జెట్‌ బ్రాండెడ్‌ ఫోన్లకు గట్టి పోటీనిస్తూ వన్‌ప్లస్‌ ముందు వరుసలో ఉంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top