రణవీర్‌ సింగ్‌తో షావోమి భాగస్వామ్య ఒప్పందం

Xiaomi India Partners With Ranveer Singh To Endorse Smartphones In India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : చైనా మొబైల్‌ మేకర్‌ షావోమి భారత మార్కెట్లో తన దూకుడును మరింత పెంచేంది. తన స్మార్ట్‌ ఫోన్‌ ఉత్పత్తుల బ్రాండ్‌ అంబాసిడర్‌గా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ను ఎంచుకుంది. ఈ మేరకు రణ్‌వీర్‌తో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకుంది. తన నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ను రణ్‌వీర్‌ నటించిన ఒక వెబ్‌ ఫిల్మ్‌లో ప్రదర్శించనున్నారని కంపెనీ పేర్కొంది. ‘షావోమి ఇండియా కుటుంబంలో రణవీర్‌ చేరుకున్నారు. ఇకపై షావోమి ఉత్పత్తులు ఆయనే వినియోగదారులకు సిఫార్సు చేస్తారు. రణ్‌వీర్‌ నటించిన ‘ఐ మాయ్‌ సెక్సీ అండ్‌ ఐనో ఇట్‌’  వెబ్‌ సిరిస్‌లో నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ను ప్రదర్శిస్తారు’  అని షావోమి ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మమజైన్‌ వెల్లడించారు.

ఈ విషయంపై రణవీర్‌ మాట్లాడుతూ.. షియోమి అనేది షావోమి అనేది నంబర్‌ వన్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌. దేశీయ మర్కెట్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి సంచలనాలను సృష్టిస్తోంది. వినియోగదారులకు అత్యుత్తమ సేవలు అందించేందుకు మేమిద్దరం కలిసి కృషి చేస్తాం. మరిన్ని సంచలనాలు సృష్టించేందుకు రెడ్‌మీ నోట్ 7 తో పాటు మరిన్ని స్మార్ట్‌ ఫోన్లు ముందుకు వస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top