
దేశీ ఐటీ దిగ్గజం విప్రో లిమిటెడ్‌కు బోనస్ బొనాంజా తగిలింది. తన వాటాదారులకు బోనస్ షేర్ల జారీకి ఈ నెల 7 రికార్డ్ డేట్‌గా విప్రో ప్రకటించడంతో ఈ కౌంటర్ ఎక్స్‌బోనస్‌లోకి చేరింది. వాటాదారులకు 1:3 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. ప్రతీ 3 షేర్లకు 1 షేరుని కేటాయించనుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కొనుగోళ్ల జోరుతా విప్రో షేరు 2శాతానికిపైగా ఎగిసింది. అంతకుముందు 5శాతానికిపై పైగా లాభపడింది.
కాగా జనవరంలోనే విప్రో బోనస్ వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. గత 8 నెలల్లో విప్రో షేరు 45 శాతం ర్యాలీ అయింది.