అజీం ప్రేమ్‌జీ సంచలన నిర్ణయం

Wipro founder Azim Premji to retire by endJul , Abidali Neemuchwala will be new MD  - Sakshi

సాఫ్ట్‌వేర్‌ సేవల సంస్థ విప్రో ఫౌండర్‌, చైర్మన్ అజీం ప్రేమ్‌జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు. జులై చివరి నుంచి విప్రో ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలనుంచి విశ్రాంతి తీసుకోనున్నారని విప్రో ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందాల్సి వుందని  పేర్కొంది. అయితే ప్రేమ్‌జీ బోర్డులో తే ఐదేళ్ల పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ , వ్యవస్థాపక చైర్మన్‌గా కొనసాగుతారని విప్రో వెల్లడించింది.

విప్రో ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా 53 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తరువాత  ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అజీం ప్రేమ్‌జీ స్థానంలో ఆయన కుమారుడు, ప్రస్తుత చీఫ్‌  స్ట్రాటజీ ఆఫీసర్ రిషద్‌  ప్రేమ్‌జీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించనున్నారు. 2024 జూలై 30 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు  అలాగే కొత్త ఎండీ, సీఈవో బాధ్యతలను తిరిగి అబిదాలి నీముచ్ చేపట్టనున్నారు.  జూలై 31, 2019నుంచి  ఈ నియామకం అమల్లోకి  రానున్నాయి.

"ఇది నాకు చాలా సుదీర్ఘమైన, సంతృప్తికరమైన ప్రయాణం. భవిష్యత్తులో దాతృత్వ కార్యక్రమాలపై మరింత దృష్టి కేంద్రీకరించడంతోపాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని ప్రణాళిక వేసుకున్నాను’’  అని అజీం ప్రేమ్‌జీ  ఒక ప్రకటనలో తెలిపారు. వాటా దారుల ప్రయోజనాలను కాపాడటంలో  రిషద్‌ నేతృత్వంలోని విప్రో  టీం ముందుంటుందనే విశ్వాసాన్ని ఆయన  వ్యక్తం చేశారు.

అజీం కుమారుడు, కొత్త ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top