భారత్‌కు షావోమి కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్

Will Xiaomi Launch A Completely New Flagship Smartphone In India? - Sakshi

న్యూఢిల్లీ : భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో సంచలనాలు సృష్టిస్తున్న షావోమి, మరో కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌, భారత మార్కెట్‌లో హల్‌చల్‌ చేయబోతుందని ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ రిపోర్టు చేసింది. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌తో రూపొందుతుందని, దీని కోడ్‌-నేమ్‌ ‘బెర్రిలియం’గా రిపోర్టు రివీల్‌ చేసింది. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 845 గ్రాఫిక్స్‌ కోసం ఆండ్రినో 630 జీపీయూతో మార్కెట్‌లోకి వస్తుందని, నాచ్‌తో ఎల్‌సీడీ డిస్‌ప్లేను, 18:9 యాక్స్పెప్ట్‌ రేషియోను ఇది కలిగి ఉందని రిపోర్టు పేర్కొంది. 

రహస్యమైన ఫోన్‌ బ్రాండ్‌ ‘పోకోఫోన్‌’ను ఇటీవలే షావోమి ట్రేడ్‌మార్కు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనికిందనే ఈ కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతుందని ఎక్స్‌డీఏ డెవలపర్స్‌ రిపోర్టు చేసింది. అంతేకాక క్వాల్‌కామ్‌ 845 ప్రాసెసర్‌, ఎల్‌సీడీ నాచ్‌ స్టయిల్‌ డిస్‌ప్లేలు ఆండ్రాయిడ్‌ ఓరియోతో పనిచేయనున్నాయని, ఈ ఫోన్‌ 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండబోతుందని పేర్కొంది. అయితే ఈ డివైజ్‌ గురించి ఇప్పటివరకు షావోమి ఇసుమంతైనా స్పందించలేదు. జూలై 24న షావోమి తన గ్లోబల్‌ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. ఈ సమయంలో షావోమి తన కొత్త ప్రొడక్ట్‌లను లాంచ్‌ చేస్తోంది. ఎంఐ ఏ2 కూడా అప్పుడే లాంచ్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top