వచ్చే ఏడాదిన్నరలోగా రెండులక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ అన్నారు. వచ్చే ఏడాదిలోగా మళ్లీ పెట్రోల్ బంకులు తెరుస్తామని చెప్పారు.
ముంబయి: వచ్చే ఏడాదిన్నరలోగా రెండులక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ అన్నారు. వచ్చే ఏడాదిలోగా మళ్లీ పెట్రోల్ బంకులు తెరుస్తామని చెప్పారు. చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి వ్యాపారం మందగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.
వచ్చే డిసెంబర్ నాటికి రిలయన్స్ జియో కార్యక్రమాలు ప్రారంభిస్తామని ముఖేశ్ తెలిపారు. రూ.4000 లోపే 4జీ స్మార్ట్ ఫోన్లు అందిస్తామని, ఇది కూడా డిసెంబర్నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. శుక్రవారం ముంబయిలో జరిగిన రిలయన్స్ షేర్ హోల్డర్స్ మీటింగ్ లో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.