రూ.199 ప్యాక్‌పై రోజుకు 2.8 జీబీ డేటా

Vodafone Now Offers 2.8GB Daily Data At Rs 199 - Sakshi

ముంబై : రిలయన్స్‌ జియోకు కౌంటర్‌ ఇవ్వడానికి టెలికాం కంపెనీలన్నీ దాదాపు తమ ప్లాన్లను సమీక్షిస్తూనే ఉ‍న్నాయి. అంతకముందు ఆఫర్‌ చేసే డేటాను దాదాపు రెండింతలు పెంచుతున్నాయి. తాజాగా వొడాఫోన్‌ సైతం తన డేటా పరిమితిని రెండింతలు చేసింది. తన మెస్ట్‌ అఫార్డబుల్‌ ప్యాక్‌ 199 రూపాయలపై రోజుకు 2.8 జీబీ 3జీ లేదా 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అంతకముందు ఈ ప్యాక్‌పై కేవలం రోజుకు 1.4జీబీ డేటా మాత్రమే అందించేది. అయితే ఈ ఆఫర్‌ కేవలం ఎంపిక చేసిన కస్టమర్లకేనని, వొడాఫోన్‌ సబ్‌స్క్రైబర్లందరికీ కాదని తెలిసింది. అదనంగా ఈ ఆఫర్‌ వొడాఫోన్‌ 4జీ ఉన్న టెలికాం సర్కిళ్లకు అందుబాటులో ఉంది. 

అప్‌డేట్‌ చేసిన 199 రూపాయల ప్రీపెయిడ్‌ ప్యాక్‌, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను అందిస్తోంది. అయితే ఈ ఉచిత వాయిస్‌ కాల్స్‌లోనూ రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు వాడుకునే పరిమితి మాత్రమే ఉంది. వొడాఫోతో పోలిస్తే, రిలయన్స్‌ తన అఫార్డబుల్‌ రూ.198 ప్యాక్‌పై కేవలం రోజుకు 2 జీబీ డేటా మాత్రమే ఇస్తోంది. పోస్టు పెయిడ్‌ సబ్‌స్క్రైబర్లకు, వొడాఫోన్‌ ఇటీవలే ‘లోయస్ట్‌ బిల్‌ గ్యారెంటీ’తో కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. అదేవిధంగా ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీ అమెజాన్‌తో కూడా వొడాఫోన్‌ జతకట్టింది. ఈ భాగస్వామ్యంలో అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీసులను ఏడాది పాటు ఎంపిక చేసిన యూజర్లకు ఉచితంగా అందిస్తోంది. అయితే ఆ సబ్‌స్క్రైబర్లు వొడాఫోన్‌ రెడ్‌ పోస్టు పెయిడ్‌ ప్లాన్‌ను కలిగి ఉండాలి. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top