వోడాఫోన్‌ కొత్త ప్లాన్‌: సరికొత్త ట్విస్ట్‌

Vodafone New Plan for Prepaid Customers  unlimited voice calls, 10GB data at Rs 597 - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ రెండవ అతిపెద్ద  టెలికాం కంపెనీ వోడాఫోన్‌ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త  ప్లాన్‌ను అందు బాటులోకి తీసు​కొచ్చింది.  ప్రీపెయిడ్‌ కస‍్టమర్లకోసం  597 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది.  ఇందులో అన్‌లిమిటెడ్‌  వాయిస్‌కాల్స్‌, 10జీబీ డేటా, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. 

జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్‌ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకొచ్చింది. అయితే ఈ ప్లాన్‌లో దుర్వినియోగం నివారించడానికంటూ కొన్ని పరిమితులు విధించడం  విశేషం.  ముఖ్యంగా వాయిస్ కాలింగ్‌లో పరిమితి పెట్టింది.  రోజుకు 250 నిమిషాలు,  వారానికి 1000 నిమిషాలకు మాత్రమే కాల్స్‌ పరిమితం.  అంతేకాదు మొత్త వాలిడిటీ పీరియడ్‌లో 100  యూనిక్‌ నెంబర్లకు మాత్రమే కాల్‌ చేసుకునే అవకాశం ఉంది.  అంతేనా..ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా వుంది. ఈ ప్లాన్ వాలిడిటీస్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం 112 రోజులు, ఫీచర్ ఫోన్ వినియోగదారులకయితే 168 రోజులుగా  నిర్ణయించింది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top