ఇంటిని మెరిపిద్దాం! | Visaka industries introduces Fiber Cement Boards | Sakshi
Sakshi News home page

ఇంటిని మెరిపిద్దాం!

Jul 15 2017 1:51 AM | Updated on Sep 5 2017 4:02 PM

ఇంటిని మెరిపిద్దాం!

ఇంటిని మెరిపిద్దాం!

ఇటుక ఇటుక పేర్చుకుంటూ కష్టపడితే తప్ప సొంతిల్లు పూర్తవదు. కానీ, టెక్నాలజీ అభివృద్ధి అయ్యాక ఇటుక అవసరం లేదంటోంది.

విపణిలో వీ బోర్డ్స్, ప్రీమియమ్స్,
డిజైన్స్, ప్లాంక్స్, ప్యానెల్స్‌
గేటు నుంచి ఫాల్స్‌ సీలింగ్‌ వరకూ అన్నింటికీ ఫైబర్‌ సిమెంటే
నాణ్యత, నిర్మాణ సమయం ఆదా,
అందుబాటు ధర ఇదీ ప్రత్యేకత


సాక్షి, హైదరాబాద్‌
ఇటుక ఇటుక పేర్చుకుంటూ కష్టపడితే తప్ప సొంతిల్లు పూర్తవదు. కానీ, టెక్నాలజీ అభివృద్ధి అయ్యాక ఇటుక అవసరం లేదంటోంది. గట్టిగా చెప్పాలంటే ఇసుక, సిమెంట్‌ కూడా అక్కర్లేదంటోంది విశాఖ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌! ఈ సంస్ధ బ్రాండ్లలో ఒకటైన వీ నెక్ట్స్‌ ఉత్పత్తుల గురించే ఈ ఉపోద్ఘాతమంతా. జస్ట్‌ వీ నెక్ట్స్‌ చాలు సొంతిల్లు.. అది కూడా అందంగా ముస్తాబు చేయొచ్చంటోందీ సంస్థ.

గేటు నుంచి ఫాల్స్‌ సీలింగ్‌ వరకూ..
వీ నెక్ట్స్‌ ఉత్పత్తులను నివాస, వాణిజ్య, పారిశ్రామిక ఇంటీరియర్‌ మరియు ఎక్స్‌టీరియర్‌ కోసం వినియోగించుకోవచ్చు. ఇంటీరియర్‌లో.. ఫాల్స్‌ సీలింగ్, గది విభజన, కిచెన్‌ క్యాబినెట్స్, వర్క్‌ స్టేషన్స్, మేజనైనింగ్‌ ఫ్లోరింగ్, వాల్‌ ప్యానలింగ్‌ కోసం ఎక్స్‌టీరియర్‌లో.. సీఎంసీ కట్‌ ఎలివేషన్, డక్ట్‌ కవరింగ్, గేట్‌ క్లాడింగ్, వెంటిలేటెడ్‌ డక్ట్, బాల్కనీ ఫాల్స్‌ సీలింగ్, గార్డెన్‌ ఫెన్సింగ్, తలుపులు, కిటికీలు, సెల్ఫుల వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు.

కార్పెట్‌ ఏరియా ఎక్కువొస్తుంది..
ప్రధానంగా ఇవి పర్యావరణహితమైన (ఈకో ఫ్రెండ్లీ) ఉత్పత్తులు.
చెదలు, తప్పు వంటివి పట్టదు. వీటికి నీటి నిరోధక శక్తి ఎక్కువ. తేమ దరిచేరదు.
అగ్ని ప్రమాదాలను నిరోధిస్తుంది.  సాధారణ ఇళ్లతో పోలిస్తే వీ నెక్ట్స్‌ సముదాయాల్లో 15 శాతం చల్లగా ఉంటాయి.
నిర్మాణ సమయంలో ప్లాస్టరింగ్, క్యూరింగ్, ఫైన్‌ ఫినిషింగ్‌ అవసరం లేకుండా నేరుగా వీ నెక్ట్స్‌ బోర్డ్‌లను వినియోగించుకోవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది. కావాలంటే వీటిని తొలగించి వేరే చోట వినియోగించుకోవచ్చు కూడా.
గోడలకు బదులుగా వీ ప్యానెల్స్‌ వినియోగించవచ్చు. దీంతో కార్పెట్‌ ఏరియా ఎక్కువొస్తుంది. సాధారణ ఫ్లాట్ల ఏరియాలతో పోలిస్తే 7 శాతం అదనపు స్థలం వస్తుంది.
ప్లైవుడ్, జీఐ ఉత్పత్తులతో పోలిస్తే వీ నెక్స్‌›్టధరలు 5–7 శాతం వరకు తక్కువుంటాయి. జీవిత కాలం 50 ఏళ్లకు పైమాటే.
నెక్స్‌›్టఉత్పత్తులివే..
బోర్డ్స్‌: వీటిని ఇంటీరియర్‌ కోసం వినియోగిస్తారు. 8/4 సైజులో 4 ఎంఎం నుంచి 25 ఎంఎం వరకుంటాయి. ధర రూ.384
ప్రీమియమ్స్‌: ఎక్స్‌టీరియర్‌ కోసం వినియోగిస్తుంటారు. ఇవి కూడా 8/4 సైజులో 4 ఎంఎం నుంచి 18 ఎంఎం వరకుంటాయి. ధర రూ.512.
డిజైన్స్‌: వీటిలో ఓషియానిక్, లేక్‌ అండ్‌ హిల్స్, స్యాండ్‌ స్టోన్, స్టోన్, వేవ్‌ అని ఐదు రకాలుంటాయి. ఇవి 2/2, 8/4 సైజుల్లో 4 ఎంఎం మందంతో ఉంటాయి. ధర రూ.576.
ప్లాంక్స్‌: 6 నుంచి 10 ఇంచుల్లో ఉంటాయి. వీటిని గేట్, గార్డెన్‌ ఫెన్సింగ్, బాల్కనీ ఫాల్స్‌ సీలింగ్, అపార్ట్‌మెంట్‌ లూవర్స్‌ వంటి ప్రాంతాల్లో వినియోగిస్తారు. ధర రూ.250.
ప్యానెల్స్‌: గదిని విభజించడానికి వినియోగి స్తారు. 50 ఎంఎం, 75 ఎంఎం మందంతో 2 ఫీట్ల వెడల్పు, 11 ఫీట్ల ఎత్తుంటాయి. ధర రూ.1,400.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement