breaking news
Visaka Industries Limited
-
విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన రూ.8 కోట్లు ఫ్రీజ్!
సాక్షి, హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్‌కు సంబంధించిన విశాక ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్విసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాలోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ఆదేశాల మేరకు నగర పోలీసు ఉన్నతాధికారుల సూచనలతో ఈ చర్య తీసుకున్నట్లు మధ్య మండల డీసీపీ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. గత సోమవారం జరిగిన ఈ వ్యవహారంపై ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం సీఈఓకు ఫిర్యాదు చేశారు. ఈ విజిలెన్స్ కంపెనీ రామగుండంలోని వివేక్ ఇంటి చిరునామాతో ఉందని, ఆయన సంస్థ ఉద్యోగులే ఈ సంస్థ డైరెక్టర్లుగా ఉన్నారని అందులో పేర్కొన్నారు. ఈ లావాదేవీపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని, ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికే వివేక్ ఈ షెల్ కంపెనీ ఖాతా వినియోగిస్తున్నట్లు సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదుతో పేర్కొన్నారు. దీంతో ఈ విషయాన్ని సీఈఓ నగర పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన సైఫాబాద్ పోలీసులు లోతుగా దర్యాప్తు చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బేగంపేట బ్రాంచ్‌లో ఉన్న విశాక ఇండస్ట్రీస్‌కు చెందిన ఓ గుర్తుతెలియని ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ సంస్థకు ఐడీబీఐ బ్యాంక్ బషీర్‌బాగ్ బ్రాంచ్‌లోకి బదిలీ అయినట్లు గుర్తించారు. సోమవారం ఉదయం 10.57 గంటలకు జరిగిన ఈ లావాదేవీ అనుమానాస్పదంగా ఉండటంతో సైఫాబాద్ పోలీసులు ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేయించారు. దీనిపై ఎన్నికల అధికారులతో పాటు ఆదాయపు పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర విభాగాలకు సమాచారం ఇచ్చారు. దీనిపై దర్యాప్తు చేపట్టామని, వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని డీసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. -
ఇంటిని మెరిపిద్దాం!
♦ విపణిలో వీ బోర్డ్స్, ప్రీమియమ్స్, ♦ డిజైన్స్, ప్లాంక్స్, ప్యానెల్స్ ♦ గేటు నుంచి ఫాల్స్ సీలింగ్ వరకూ అన్నింటికీ ఫైబర్ సిమెంటే ♦ నాణ్యత, నిర్మాణ సమయం ఆదా, ♦ అందుబాటు ధర ఇదీ ప్రత్యేకత సాక్షి, హైదరాబాద్ ఇటుక ఇటుక పేర్చుకుంటూ కష్టపడితే తప్ప సొంతిల్లు పూర్తవదు. కానీ, టెక్నాలజీ అభివృద్ధి అయ్యాక ఇటుక అవసరం లేదంటోంది. గట్టిగా చెప్పాలంటే ఇసుక, సిమెంట్ కూడా అక్కర్లేదంటోంది విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్! ఈ సంస్ధ బ్రాండ్లలో ఒకటైన వీ నెక్ట్స్ ఉత్పత్తుల గురించే ఈ ఉపోద్ఘాతమంతా. జస్ట్ వీ నెక్ట్స్ చాలు సొంతిల్లు.. అది కూడా అందంగా ముస్తాబు చేయొచ్చంటోందీ సంస్థ. గేటు నుంచి ఫాల్స్ సీలింగ్ వరకూ.. వీ నెక్ట్స్ ఉత్పత్తులను నివాస, వాణిజ్య, పారిశ్రామిక ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ కోసం వినియోగించుకోవచ్చు. ఇంటీరియర్‌లో.. ఫాల్స్ సీలింగ్, గది విభజన, కిచెన్ క్యాబినెట్స్, వర్క్ స్టేషన్స్, మేజనైనింగ్ ఫ్లోరింగ్, వాల్ ప్యానలింగ్ కోసం ఎక్స్టీరియర్లో.. సీఎంసీ కట్ ఎలివేషన్, డక్ట్ కవరింగ్, గేట్ క్లాడింగ్, వెంటిలేటెడ్ డక్ట్, బాల్కనీ ఫాల్స్ సీలింగ్, గార్డెన్ ఫెన్సింగ్, తలుపులు, కిటికీలు, సెల్ఫుల వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు. కార్పెట్ ఏరియా ఎక్కువొస్తుంది.. ♦ ప్రధానంగా ఇవి పర్యావరణహితమైన (ఈకో ఫ్రెండ్లీ) ఉత్పత్తులు. ♦ చెదలు, తప్పు వంటివి పట్టదు. వీటికి నీటి నిరోధక శక్తి ఎక్కువ. తేమ దరిచేరదు. ♦ అగ్ని ప్రమాదాలను నిరోధిస్తుంది. సాధారణ ఇళ్లతో పోలిస్తే వీ నెక్ట్స్ సముదాయాల్లో 15 శాతం చల్లగా ఉంటాయి. ♦ నిర్మాణ సమయంలో ప్లాస్టరింగ్, క్యూరింగ్, ఫైన్ ఫినిషింగ్ అవసరం లేకుండా నేరుగా వీ నెక్ట్స్ బోర్డ్లను వినియోగించుకోవచ్చు. దీంతో సమయం ఆదా అవుతుంది. కావాలంటే వీటిని తొలగించి వేరే చోట వినియోగించుకోవచ్చు కూడా. ♦ గోడలకు బదులుగా వీ ప్యానెల్స్ వినియోగించవచ్చు. దీంతో కార్పెట్ ఏరియా ఎక్కువొస్తుంది. సాధారణ ఫ్లాట్ల ఏరియాలతో పోలిస్తే 7 శాతం అదనపు స్థలం వస్తుంది. ♦ ప్లైవుడ్, జీఐ ఉత్పత్తులతో పోలిస్తే వీ నెక్స్›్టధరలు 5–7 శాతం వరకు తక్కువుంటాయి. జీవిత కాలం 50 ఏళ్లకు పైమాటే. ♦ నెక్స్›్టఉత్పత్తులివే.. ♦ బోర్డ్స్: వీటిని ఇంటీరియర్ కోసం వినియోగిస్తారు. 8/4 సైజులో 4 ఎంఎం నుంచి 25 ఎంఎం వరకుంటాయి. ధర రూ.384 ♦ ప్రీమియమ్స్: ఎక్స్టీరియర్ కోసం వినియోగిస్తుంటారు. ఇవి కూడా 8/4 సైజులో 4 ఎంఎం నుంచి 18 ఎంఎం వరకుంటాయి. ధర రూ.512. ♦ డిజైన్స్: వీటిలో ఓషియానిక్, లేక్ అండ్ హిల్స్, స్యాండ్ స్టోన్, స్టోన్, వేవ్ అని ఐదు రకాలుంటాయి. ఇవి 2/2, 8/4 సైజుల్లో 4 ఎంఎం మందంతో ఉంటాయి. ధర రూ.576. ♦ ప్లాంక్స్: 6 నుంచి 10 ఇంచుల్లో ఉంటాయి. వీటిని గేట్, గార్డెన్ ఫెన్సింగ్, బాల్కనీ ఫాల్స్ సీలింగ్, అపార్ట్మెంట్ లూవర్స్ వంటి ప్రాంతాల్లో వినియోగిస్తారు. ధర రూ.250. ♦ ప్యానెల్స్: గదిని విభజించడానికి వినియోగి స్తారు. 50 ఎంఎం, 75 ఎంఎం మందంతో 2 ఫీట్ల వెడల్పు, 11 ఫీట్ల ఎత్తుంటాయి. ధర రూ.1,400.