విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌గా యశ్ బిర్లా సూర్య | UCO Bank names Yash Birla Wilful Defaulter Puts notice with Photo  | Sakshi
Sakshi News home page

 విల్‌ఫుల్‌ డిఫాల్టర్‌గా యశ్ బిర్లా సూర్య

Jun 17 2019 11:25 AM | Updated on Jun 17 2019 11:29 AM

UCO Bank names Yash Birla Wilful Defaulter Puts notice with Photo  - Sakshi

యశ్‌ బిర్లా గ్రూప్ ఛైర్మన్, యశోవర్ధన్‌ బిర్లా (ఫైల్‌ ఫోటో)

ఉద్దేశపూర్వక రుణ వేగవేతదారుల జాబితాలో మరో పారిశ్రామికవేత్త  చేరాడు. యశ్‌ బిర్లా గ్రూప్ ఛైర్మన్, యశోవర్ధన్ బిర్లాను యుకో బ్యాంక్ ఉద్దేశపూర్వక ఎగవేతదారుడుగా ప్రకటించింది. బిర్లా సూర్య  కంపెనీ రూ.67.65 కోట్లు చెల్లించలేదంటూ బ్యాంకు ఆదివారం ఈ మేరకు బహిరంగ  నోటీసులు జారీ చేసింది. 

అప్పు తీర్చే ఆర్థిక సామర్థ్యం ఉన్నప్పటికీ బకాయిలు చెల్లించని ఉద్దేశపూర్వక రుణఎగవేతదారుడుగా  బిర్లా సూర్యను ముంబైలోని యుకో బ్యాంక్ కార్పొరేట్ శాఖ  ప్రకటించింది. రుణ బకాయిలు  చెల్లించనందున, యశ్‌ బిర్లాను గతంలో (జూన్ 3, 2013)  ఎన్‌పిఎగా  బ్యాంకు ప్రకటించింది. అప్పటినుండి బకాయి రూ .67.65 కోట్లకు చేరింది. దీనిపై అనేక నోటీసులు ఉన్నప్పటికీ,  రుణగ్రహీత తమకు చెల్లించాల్సిన బకాయిలను తిరిగి చెల్లించలేదంటే యశ్‌ బిర్లా ఫోటోతో సహా  విడదుల చేసిన నోటీసులో బ్యాంక్ పేర్కొంది. అలాగే యశ్‌ బిర్లా సంస్థ దాని డైరెక్టర్లు, ప్రమోటర్లు, హామీదారులను ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (విల్‌ఫుల్‌ డిఫాల్టర్స్‌) గా బ్యాంక్ ప్రకటించింది. కోల్‌కతాకు చెందిన యుకో బ్యాంక్ మరో ఏడు కంపెనీల డైరెక్టర్లను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా ప్రకటించింది.  దీంతో మొత్తం బకాయి రూ.740 కోట్లుగా ఉంది. 

కాగా నిధుల మళ్లింపు, అవినితికిఆరోపణలకు సంబంధించి బిర్లా సంస్థలు బిర్లా కాట్సిన్‌, బిర్లా శోకాఎడ్యూటెక్‌, జెనిత్‌స్టీల్ కంపెనీలపై కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటికే (2018, సెప్టెంబరు) దర్యాప్తునకు  ఆదేశించింది. యశోవర్ధన్ బిర్లాకు బిర్లా సూర్యతోపాటు డజనుకు పైగా ఇతర కంపెనీలు ఉన్నాయి. జెనిత్ స్టీల్, బిర్లా పవర్, బిర్లా లైఫ్‌ స్టైల్‌,  శ్లోకా ఇన్ఫోటెక్ ప్రధానమైనవి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement