వేతన కోతను ప్రకటించిన టీవీఎస్‌

TVS Motor Company Announces Salary Cuts For Employees - Sakshi

కోవిడ్‌-19 ఎఫెక్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్‌-19 ఎఫెక్ట్‌తో ఉద్యోగుల వేతనాల్లో కోతను విధిస్తున్నట్టు టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ వెల్లడించింది. వేతన కోతను ప్రకటించిన దేశంలో తొలి టూవీలర్‌ బ్రాండ్‌ టీవీఎస్‌ కావడం గమనార్హం. కోవిడ్‌-19 కట్టడికి విధించిన లాక్‌డౌన్‌తో ఉత్పాదకత, అమ్మకాలు నిలిచిపోవడంతో ఉద్యోగులందరికీ ఈ ఏడాది మే నుంచి అక్టోబర్‌ వరకూ వేతనాలను తగ్గించాలని నిర్ణయించామని కంపెనీ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో అమ్మకాలు తీవ్రంగా పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఉద్యోగులకు వేతనాలను బట్టి 5 నుంచి 20 శాతం వరకూ వేతన కోత విధించారు. ఆటోమొబైల్‌ సేల్స్‌ దారుణంగా పడిపోవడంతో ఇతర ఆటోమొబైల్‌ కంపెనీ ఉద్యోగుల్లోనూ వేతన గుబులు మొదలైంది.

చదవండి : కేసీఆర్‌ తాతా కనికరించవా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top