మైక్రోసాప్ట్ తో చేతులు కలపనున్న టయోటా | Toyota, Microsoft to collaborate on connected-car technology | Sakshi
Sakshi News home page

మైక్రోసాప్ట్ తో చేతులు కలపనున్న టయోటా

Apr 5 2016 4:13 PM | Updated on Sep 3 2017 9:16 PM

మైక్రోసాప్ట్ తో చేతులు కలపనున్న టయోటా

మైక్రోసాప్ట్ తో చేతులు కలపనున్న టయోటా

టోక్యో : ఇంటర్నెట్ కార్లను మార్కెట్లోకి మరిన్ని విస్తరించాలని టయోటా ప్రణాళికలు రచిస్తోంది.

టోక్యో : ఇంటర్నెట్ కార్లను మార్కెట్లోకి మరిన్ని విస్తరించాలని టయోటా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే జపాన్ లో ఈ తరహా ఆటోమొబైల్స్ ను ప్రవేశపెట్టిన ఆ దేశీయ కార్ల కంపెనీ టయోటా, యూఎస్ టెక్ దిగ్గజం మెక్రోసాప్ట్ తో చేతులు కలపనుంది. టెక్నాలజీ పరంగా మైక్రోసాప్ట్ సహాయం తీసుకుని, భవిష్యత్ లో మరిన్ని ఇంటర్నెట్ సేవలను కార్లలో అందించాలనుకుంటోంది. ఈ సేవలు అడ్వాన్స్ డ్ క్లౌండ్ డేటా అనాలిసిస్ ఆధారంగా డ్రైవర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కు అందించాలని టయోటా నిర్ణయించింది.

కొత్త తరహాలో వచ్చే ఈ కార్ల విధానాలను డ్రైవర్లు నేర్చుకోవాలని టయోటా పేర్కొంది. టెక్నాస్ లో ఏర్పాటుచేసిన ఈ కార్ల కంపెనీలో తొలుత 5.5 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. ఇంటర్నెట్ తరహా కార్లు జపాన్ తో పాటు యూఎస్ లోనూ చక్కర్లు కొట్టేలా చేయాలని టయోటా లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement