లెక్సస్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ@ రూ.99 లక్షలు

న్యూఢిల్లీ: టయోటా గ్రూప్‌నకు చెందిన లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ ‘లెక్సస్’ తాజాగా తన హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘ఆర్‌ఎక్స్ 450హెచ్‌ఎల్’ కారును భారత్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.99 లక్షలు (ఎక్స్‌షోరూం, ఢిల్లీ). అదనపు మూడవ వరుస సీటింగ్‌తో వచ్చిన ఈ మోడల్.. బీఎస్–6 ప్రమాణాలతో విడుదలైంది. 3.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది. మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం, డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన ధరతో ఈ కారు విడుదలైంది’ అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ పీబీ వేణుగోపాల్ చెప్పారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి