హీరో మోటొకార్ప్ కొత్త స్కూటర్లు | The hero new scooters moto Corp. | Sakshi
Sakshi News home page

హీరో మోటొకార్ప్ కొత్త స్కూటర్లు

Sep 30 2015 12:45 AM | Updated on Sep 3 2017 10:11 AM

హీరో మోటొకార్ప్ కొత్త స్కూటర్లు

హీరో మోటొకార్ప్ కొత్త స్కూటర్లు

హీరో మోటొకార్ప్ కంపెనీ స్కూటర్ల సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లను మంగళవారం ఆవిష్కరించింది. 110 సీసీ కేటగిరిలో మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యూయట్ పేర్లతో

న్యూఢిల్లీ : హీరో మోటొకార్ప్ కంపెనీ  స్కూటర్ల సెగ్మెంట్లో రెండు కొత్త మోడళ్లను మంగళవారం ఆవిష్కరించింది. 110 సీసీ కేటగిరిలో మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యూయట్ పేర్లతో ఈ రెండు కొత్త మోడళ్లను అందిస్తోంది. మ్యాస్ట్రో ఎడ్జ్ స్కూటర్ ధరలు రూ.49,500 నుంచి రూ.50,700 (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) రేంజ్‌లో ఉన్నాయని హీరో మోటొకార్ప్ చైర్మన్ ఎండీ, సీఈఓ పవన్ ముంజాల్  చెప్పారు. వచ్చే నెల 13 నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత డ్యుయట్ మోడల్ అమ్మకాలు ఉంటాయని వివరించారు. 

డ్యుయట్ మోడల్ ధరల వివరాలను ఆయన  వెల్లడించలేదు. ఇప్పటికే మ్యాస్ట్రో, ప్లెజర్ స్కూటర్లను విక్రయిస్తున్నామని, తాజాగా అందుబాటులోకి తెచ్చిన  రెండు కొత్త మోడళ్లతో కలుపుకొని తమ మొత్తం స్కూటర్ల సంఖ్య నాలుగుకు పెరిగిందని ముంజాల్ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement