వీడియోకాన్ డీ2హెచ్ లో మరిన్ని తెలుగు చానళ్లు | telugu channels added in videocon d2h | Sakshi
Sakshi News home page

వీడియోకాన్ డీ2హెచ్ లో మరిన్ని తెలుగు చానళ్లు

Jun 1 2016 1:18 AM | Updated on Sep 4 2017 1:21 AM

వీడియోకాన్ డీ2హెచ్ లో మరిన్ని తెలుగు చానళ్లు

వీడియోకాన్ డీ2హెచ్ లో మరిన్ని తెలుగు చానళ్లు

దేశీ ప్రముఖ డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ ‘వీడియోకాన్ డీ2హెచ్’ తాజాగా తన తెలుగు ప్లాట్‌ఫామ్‌కు మరో మూడు కొత్త చానళ్లను జతచేసింది.

హైదరాబాద్: దేశీ ప్రముఖ డీటీహెచ్ సర్వీస్ ప్రొవైడర్ ‘వీడియోకాన్ డీ2హెచ్’ తాజాగా తన తెలుగు ప్లాట్‌ఫామ్‌కు మరో మూడు కొత్త చానళ్లను జతచేసింది. కొత్తగా ఈటీవీ సినిమా, ఈటీవీ తెలంగాణ, డీడీ యాదగిరి అనే తెలుగు చానళ్లను ప్రసారం చేస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈటీవీ సినిమా అనే తెలుగు మూవీ చానల్ 716 నెంబర్‌లో, తెలంగాణ రాష్ట్ర దూరదర్శన్‌కు సంబంధించిన డీడీ యాదగిరి అనే చానల్ 745 నె ంబర్‌లో, ఈటీవీ తెలంగాణ అనే న్యూస్ చానల్ 734 నెంబర్‌లో వస్తాయని పేర్కొంది. దీంతో వీడియోకాన్ మొత్తంగా 43 తెలుగు చానళ్లను ప్రసారం చేస్తోంది. కొత్త చానళ్లతో తమ మార్కెట్ మరింత పెరుగుతుందని సంస్థ సీఈవో అనిల్ ఖెరా అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువకావడానికి తమ చర్య దోహదపడుతుందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సౌరభ్ దత్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement