పిల్లల ఛానల్‌ పోగో ఇప్పుడు తెలుగు భాషలో..

Pogo Launches Telugu Language Feed - Sakshi

పలు కార్టూన్స్‌తో పిల్లలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తోన్న ప్రముఖ టీవీ ఛానల్‌ పోగో ఇప్పుడు తెలుగులో రానుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉనికిని విస్తరించుకోవాలనే లక్ష్యంతో పోగో తెలుగు ఛానల్‌ను మొదలుపెట్టినట్లు కంపెనీ పేర్కొంది. 100 శాతం స్వదేశీ యానిమేషన్‌ ఫీడ్‌తో  తెలుగు రాష్ట్రాల్లోని వీక్షకులకు పోగో మరింత దగ్గర కానుంది. ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో పోగో తన సేవలను ప్రారంభించింది. కామెడీ సిరీస్‌లోని ఒకటైన టీటూ-హర్‌ జవాబ్‌ కా సవాల్‌ హు, స్మాషింగ్‌ సింబా, చోటా భీమ్‌ లాంటి కార్టూన్‌ షోలు ఇటీవలి కాలంలో అత్యంత ఆదరణను పొందాయి.     

తెలుగు పోగో ఛానల్‌ ఆవిష్కరణ సందర్భంగా కార్టూన్‌ నెట్‌వర్క్‌ అండ్‌ పోగో దక్షిణాసియా నెట్‌వర్క్‌ హెడ్‌ మాట్లాడుతూ...స్ధానిక భాషలో కంటెంట్‌ను అందిస్తామనే విషయంలో పోగో తెలుగు ఛానల్‌తో కంపెనీ ఓ అడుగు ముందుకేసింది. ప్రపంచస్ధాయి కంటెంట్‌ను, యానిమేషన్లను, కథలను ఎక్కువ సంఖ్యలో భారతీయ ప్రేక్షకులకు అందించే అవకాశం వస్తోందని అభిప్రాయపడ్డారు. 
చదవండి: ట్విటర్‌ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీలకు కూడా భారతీయులే సీఈఓలు..!

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top