జెఎల్‌ఆర్‌ దెబ్బ: టాటా మోటార్స్‌కు భారీ నష్టాలు

Tata Motors Posts Worst Quarterly Loss In Nine Years - Sakshi

సాక్షి, ముంబై: ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా  మోటార్స్‌ లిమిటెడ్  క్యూ1 ఫలితాల్లో   నిరాశపర్చింది.  మంగళవారం మార్కెట్‌ ముగిసిన తరువాత ప్రకటించిన  ఈ ఏడాది తొలి త్రైమాసిక ఫలితాల్లో అనూహ్య నష్టాలను  నమోదు చేసింది.  విశ్లేషకుల అంచనాలకు ఎక్కడా అందకుండా తీవ్ర నష్టాలను ప్రకటించింది. దాదాపు తొమ్మిది సంవత్సరాలలో ఇది అత్యంత ఘోరమైనదని ఎనలిస్టులు చెప్పారు . దాని లగ్జరీ కారు యూనిట్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ నష్టాలు సంస్థ ఫలితాలను దెబ్బతీసినట్టు  పేర్కొన్నారు.

జూన్‌తో  ముగిసిన త్రైమాసికంలో నికర నష్టం 1,902.4 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో రూ .3,199 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. డిసెంబరు 2009  నాటి  2,599 కోట్ల రూపాయల నష్టం తరువాత ఇదే అతి పెద్ద నష్టంగి నిలిచింది. క్యూ1లో  రూ. 920 కోట్ల లాభాలను  విశ్లేషకులు అంచనా వేశారు. రెవెన్యూ 14.7 శాతం పెరిగి రూ .67,081 కోట్లకు చేరుకుంది.  కాగా టాటా మోటార్స్‌ ఆదాయంలో దాదాపు 90శాతం  వాటా ఉన్న  జాగ్వార్ ల్యాండ్ రోవర్ టాటా మోటార్స్  210 మిలియన్ల పౌండ్ల నష్టాన్ని చవిచూసింది.  ఐరోపా యూరోప్‌లో చైనా దిగుమతి సుంకంతోపాటు,డీజిల్‌ ఇంజీన్‌  తదితర  సవాళ్లు  జెఎల్‌ ఆర్‌ లాభాలను ప్రభావితం చేశాయని టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌  తెలిపారు.   వడ్డీ, పన్ను, తరుగుదల, రుణ విమోచనల ముందు ఆదాయాలు 9 శాతం పెరిగి రూ .5,430 కోట్లకు చేరగా .. మార్జిన్లు వార్షిక ప్రాతిపదికన 40 బేసిస్ పాయింట్లు క్షీణించి 8.1 శాతానికి చేరింది. ఈ ఫలితాలు బుధవారం నాటి మార్కెట్లో టాటా మోటార్స్‌ షేర్‌ ప్రతికూల ప్రభావాన్ని చూపించనున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top