బిట్‌కాయిన్స్‌తో జాగ్రత్త: ఆర్‌బీఐ

take care of bit of care coins: RBI - Sakshi

ముంబై: బిట్‌కాయిన్స్‌ వంటి వర్చువల్‌ కరెన్సీలు చాలా రిస్కుతో కూడుకున్న నేపథ్యంలో వీటి ట్రేడింగ్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని యూజర్లు, ట్రేడర్లను రిజర్వ్‌ బ్యాంక్‌ హెచ్చరించింది. వర్చువల్‌ కరెన్సీలతో ఆర్థికమైన, చట్టపరమైన, వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ, భద్రత తదితర అంశాలపరంగా రిస్కులు ఉన్నాయని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. బిట్‌కాయిన్‌ లేదా ఇతర వర్చువల్‌ కరెన్సీల (వీసీ) నిర్వహణ, చలామణీకి సంబంధించి ఏ కంపెనీకి కూడా లైసెన్సులు ఇవ్వలేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

వీసీలు ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లో ఉంటాయి కనుక హ్యాకింగ్, మాల్‌వేర్‌ దాడులు మొదలైన వాటి బారిన పడే ముప్పులు పొంచి ఉంటాయని ఆర్‌బీఐ తెలి పింది. వర్చువల్‌ కరెన్సీ ఏ నియంత్రణ సంస్థ పరిధిలో లేనందున ఈ–వాలెట్‌ గానీ పోయిం దంటే వాటిలో భద్రపర్చుకున్న సొమ్మంతా శాశ్వతంగా కోల్పోవాల్సి వస్తుందని పేర్కొంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top