వి–స్ట్రోమ్‌ 650 ఎక్స్‌టీ ఏబీఎస్‌ 

Suzuki Motorcycle launches new edition of V-Strom 650XT. Check price, features - Sakshi

మార్కెట్లోకి సుజుకీ కొత్త వేరియంట్‌

ధర రూ.7.46 లక్షలు

న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా తన ప్రీమియమ్‌ బైక్‌ మోడల్‌ వి–స్ట్రోమ్‌  650 ఎక్స్‌టీలో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. వి–స్ట్రోమ్‌  650 ఎక్స్‌టీ ఏబీఎస్‌ పేరుతో అందిస్తున్న ఈ బైక్‌ ధరను రూ.7.46 లక్షలుగా (ఎక్స్‌ షోరూమ్, న్యూఢిల్లీ) నిర్ణయించామని సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా తెలిపింది. కొత్త గ్రాఫిక్స్‌తో రూపొందిన ఈ బైక్‌లో 4 స్ట్రోక్‌ 645 సీసీ ఇంజిన్, సైడ్‌ రెఫ్లిక్టర్లు, హజార్డ్స్‌ లైట్స్‌ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ ఎమ్‌డీ సంతోషి ఉచిద తెలిపారు. బ్రిడ్జిస్టోన్‌ బాట్‌లాక్స్‌ అడ్వెంచర్‌ ఏ40 ట్యూబ్‌లెస్‌ టైర్లు, ముందువైపు టెలిస్కోపిక్‌ ఫోర్క్, ఆరు గేర్లు, త్రీ–స్టేజ్‌ ట్రాక్షన్‌ కంట్రోల్, మూడు రకాలుగా అడ్జెస్ట్‌ చేసుకునే వీలున్న విండ్‌స్క్రీన్,  తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. 

గత ఏడాదే ఈ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చామని, మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ కొత్త బైక్‌ను ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ టెక్నాలజీతో రూపొందించామని, పనితీరు మరింతగా మెరుగుపడగలదని వివరించారు. ఈ బైక్‌ కవాసకి వెర్సీస్‌ 650, ఎస్‌డబ్ల్యూఎమ్‌ సూపర్‌డ్యూయల్‌ టీ బైక్‌లకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top