యాప్ కీ కహానీ... | Stock markets likely to stay on edge | Sakshi
Sakshi News home page

యాప్ కీ కహానీ...

Sep 26 2016 12:38 AM | Updated on Sep 4 2017 2:58 PM

యాప్ కీ కహానీ...

యాప్ కీ కహానీ...

‘స్టాక్ ఎడ్జ్’ అనేది ఇండియన్ మార్కెట్లకు చెందిన ఒక హై-కస్టమైజ్‌డ్ ఫైనాన్షియల్ యాప్.

స్టాక్ ఎడ్జ్...
‘స్టాక్ ఎడ్జ్’ అనేది ఇండియన్ మార్కెట్లకు చెందిన ఒక హై-కస్టమైజ్‌డ్ ఫైనాన్షియల్ యాప్. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఈ యాప్ సాయంతో ప్రధానంగా ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చు. విశ్లేషణలు, అలర్ట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్ వంటి పలు ప్రత్యేకతలతో కూడిన ఈ యాప్.. ఇన్వెస్టర్లు, ట్రేడర్ల లావాదేవీలకు సంబంధించి సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వారికి తోడ్పాటునందిస్తుంది. ‘స్టాక్ ఎడ్జ్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

 ప్రత్యేకతలు

యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.

ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ స్టాక్స్‌ను ట్రాక్ చేయొచ్చు.

వాచ్ లిస్ట్‌కు స్టాక్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. యాప్‌లో మల్టిపుల్ వాచ్ లిస్ట్‌లను క్రియేట్ చేసుకునే వెసులుబాటు ఉంది.

ప్రైస్ టార్గెట్స్‌ను సెట్ చేసుకొని, అలర్ట్స్‌ను పొందొచ్చు.

 బల్క్/బ్లాక్ డీల్స్, ఎఫ్‌ఐఐ కార్యకలాపాలు సహా పలు రంగాల స్టాక్స్ పనితీరు ఎలా ఉందో గమనించవచ్చు.

మార్కెట్ వార్తలు, అప్‌డేట్స్, కంపెనీ ఫలితాలు, ఒప్పందాలు వంటి తదితర విషయాలను తెలుసుకోవచ్చు. 

స్టాక్స్ హెచ్చుతగ్గులను ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో చూడొచ్చు.

స్కాన్ విభాగంలోని టెక్నికల్, ప్రైజ్, వ్యాల్యుమ్ అండ్ డెలివరీ, ఫ్యూచర్ వంటి పలు రకాల ఆప్షన్ల ద్వారా స్టాక్స్ కదలికలను నిశితంగా గమనించొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement