సోనీ నుంచి జంట ఫోన్లు, మిడ్‌-రేంజ్‌లోనే

Sony Xperia R1 Plus, Xperia R1 Smartphones Launched

సోనీ ఇండియా శుక్రవారం రెండు సరికొత్త ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఎక్స్‌పీరియా ఆర్‌1 ప్లస్‌,  ఎక్స్‌పీరియా ఆర్‌1 పేరుతో వీటిని తీసుకొచ్చింది. మిడ్‌-సెగ్మెంట్‌ కస్టమర్లను టార్గెట్‌గా చేసుకుని ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసినట్టు సోనీ పేర్కొంది. ఎక్స్‌పీరియా ఆర్‌1 ప్లస్‌ ధర రూ.14,990కాగ, ఎక్స్‌పీరియా ఆర్‌1 ధర 12,990 రూపాయలు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ రెండింట్లో అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సోనీ సెంటర్‌, మేజర్‌ మొబైల్‌ స్టోర్లలో విక్రయించనున్నారు. బ్లాక్‌, సిల్వర్‌ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. 

ఎక్స్‌పీరియా ఆర్‌1 ప్లస్‌, ఆర్‌1 స్పెషిఫికేషన్లు...
ఎక్స్‌పీరియా ఆర్‌1 ప్లస్‌కు 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌
ఎక్స్‌పీరియా ఆర్‌కు 2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌
5.2 అంగుళాల హెచ్‌డీ టీఎఫ్‌టీ డిస్‌ప్లే
ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ
డ్యూయల్‌ సిమ్‌ డివైజ్‌లు
13 మెగాపిక్సెల్‌ రియర్‌ కెమెరా
8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
2620 ఎంఏహెచ్‌ బ్యాటరీ
యూఎస్‌బీ టైప్‌-సీ పోర్టు
ఆండ్రాయిడ్‌ నోగట్‌తో రన్‌, కానీ ఆండ్రాయిడ్‌ ఓరియో అప్‌డేట్‌ను కూడా కంపెనీ చేపట్టనుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top