
న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ మొబైల్ పేమెంట్స్ సర్వీసెస్ సంస్థ పేటీఎం తన సేవలను జపాన్‌కు విస్తరించనుంది. జపాన్‌లో డిజిటల్ చెల్లింపుల సేవలను ఆరింభించనున్నామని, ఇందుకోసం పేటీఎంతో బాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు సాఫ్ట్ బ్యాంకు గ్రూపు తెలిపింది. సాఫ్ట్ బ్యాంకుకు చెందిన జాయింట్ వెంచర్ పేపే కార్పొరేషన్ ఈ సేవలను ‘పేపే’ పేరుతో ఆరంభించనుంది.
అత్యధికంగా నగదు చెల్లింపులు కొనసాగుతున్న జపాన్‌లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించనున్నట్లు సాఫ్ట్‌బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుతం 20 శాతంగా ఉన్నటువంటి నగదురహిత చెల్లింపులను 2025 నాటికి 40 శాతానికి పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలిపింది.