
న్యూయార్క్: జపాన్‌కు చెందిన దిగ్గజ కంపెనీ సాఫ్ట్‌బ్యాంక్..ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్‌లో 15 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. అంతే కాకుండా అమెరికాకు చెందిన ఉబెర్ కంపెనీలో వంద కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నదని సమాచారం.
సంబంధిత వర్గాల కథనం ప్రకారం.., ఉబెర్‌లో 15 శాతం వాటాను సాఫ్ట్ బ్యాంక్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ క్యాపిటల్ కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఉబెర్ డైరెక్టర్ల బోర్డ్‌లో రెండు డైరెక్టర్ల పదవులను పొందే అవకాశాలున్నాయి.