ఇక స్నాప్డీల్ ద్వారా విమాన, బస్ టికెట్లు | Snapdeal partners with Zomato, Cleartrip, UrbanClap, redBus to offer multiple services | Sakshi
Sakshi News home page

ఇక స్నాప్డీల్ ద్వారా విమాన, బస్ టికెట్లు

Jul 5 2016 12:14 AM | Updated on Sep 4 2017 4:07 AM

ఇక స్నాప్డీల్ ద్వారా విమాన, బస్ టికెట్లు

ఇక స్నాప్డీల్ ద్వారా విమాన, బస్ టికెట్లు

ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ ద్వారా ఇక నుంచి విమాన, బస్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు.

ఈ తరహా సేవలందిస్తున్న
తొలి ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ఇదే

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్ ద్వారా ఇక నుంచి విమాన, బస్ టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా హోటల్ రిజర్వేషన్లు, ఆహార పదార్థాలను ఆర్డర్ చేయడం వంటి సర్వీసులు కూడా పొందవచ్చని స్నాప్‌డీల్ తెలిపింది. ఈ తరహా ఆన్‌లైన్ సర్వీసులందిస్తున్న తొలి ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ తమదేనని స్నాప్‌డీల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రోహిత్ బన్సాల్ చెప్పారు. జొమాటొ, క్లియర్‌ట్రిప్, అర్బన్‌క్లాప్, రెడ్‌బస్ తదితర సంస్థల భాగస్వామ్యంతో ఈ సేవలందిస్తున్నామని ఆయన వివరించారు.

వినియోగదారుల అన్ని రకాలైన అవసరాలకు తగిన సేవలందిస్తున్నామని, స్నాప్‌డీల్ ద్వారా మరింత విస్తృతమైన సేవలను అందించే ప్రయత్నాలను కొనసాగిస్తామని బన్సాల్ పేర్కొన్నారు.  2020 నాటికల్లా 2 కోట్ల రోజువారీ లావాదేవీలు జరిపే యూజర్లున్న ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్‌గా అవతరించాలనేది తమ లక్ష్యమని ఈ సందర్భంగా వివరించారు. ఈ తరహా ఆన్‌లైన్ సర్వీసులందించడం ద్వారా ఆ లక్ష్య సాధనకు చేరువ కాగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. కాగా, స్నాప్‌డీల్ భాగస్వామ్యంలో మరింతమందికి చేరువ కాగలమని జొమాటొ సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement