సీఐఐ ఏపీ చైర్మన్ గా శివ్ కుమార్ | shivkumar as cii ap chairman | Sakshi
Sakshi News home page

సీఐఐ ఏపీ చైర్మన్ గా శివ్ కుమార్

Mar 12 2016 12:58 AM | Updated on Sep 3 2017 7:30 PM

సీఐఐ ఏపీ చైర్మన్ గా శివ్ కుమార్

సీఐఐ ఏపీ చైర్మన్ గా శివ్ కుమార్

సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్‌గా 2016-17 సంవత్సరానికిగాను మాపుల్ సాఫ్ట్‌వేర్ సీఈవో జి.ఎస్.శివ్‌కుమార్ నియమితులయ్యారు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్‌గా 2016-17 సంవత్సరానికిగాను మాపుల్ సాఫ్ట్‌వేర్ సీఈవో జి.ఎస్.శివ్‌కుమార్ నియమితులయ్యారు. సీఐఐ విశాఖపట్నం జోన్ చైర్మన్‌గా, ఐసీటీ ప్యానెల్ కో-కన్వీనర్‌గా ఆయన పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడాలో కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ చేశారు. అలాగే వైస్ చైర్మన్‌గా బెటర్ క్యాస్టింగ్స్ సీఈవో జేఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఎన్నికయ్యారు. సీఐఐ ఏపీ శాఖ సభ్యుడిగా, పబ్లిక్ పాలసీ ప్యానెల్ కన్వీనర్‌గా, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. ఇండస్ట్రియల్ మెటలర్జీలో ఎంఈ పూర్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement