మూడు రోజుల నష్టాలకు చెక్ | Sensex regains 27,000-mark | Sakshi
Sakshi News home page

మూడు రోజుల నష్టాలకు చెక్

Sep 13 2014 1:03 AM | Updated on Sep 2 2017 1:16 PM

మూడు రోజుల నష్టాలకు చెక్

మూడు రోజుల నష్టాలకు చెక్

మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. అయితే రోజంతా ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ సాగింది.

మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ పడింది. అయితే రోజంతా ఒడిదుడుకుల మధ్య ట్రేడింగ్ సాగింది. చివర్లో కొనుగోళ్లు పుంజుకోవడంతో సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 27,061 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 20 పాయింట్లు పెరిగి 8,106 వద్ద స్థిరపడింది.జూలై నెలకు పారిశ్రామికోత్పత్తి, ఆగస్ట్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్లు ముగిశాక వెలువడనుండటంతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారని విశ్లేషకులు పేర్కొన్నారు.

మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి పుంజుకోవడంతో సెంటిమెంట్ మెరుగుపడినట్లు చెప్పారు. వచ్చే వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్వహించనున్న పాలసీ సమీక్షపై అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టర్లు దృష్టిపెట్టారని నిపుణులు పేర్కొన్నారు.  కాగా, వారం మొత్తానికి 34 పాయింట్లు పెరగడం ద్వారా సెన్సెక్స్ వరుసగా ఐదో వారం లాభాలతో ముగిసనట్లయ్యింది.

 కొత్త గరిష్టానికి సిప్లా
 సెన్సెక్స్ దిగ్గజాలలో సిప్లా 6.5 జంప్ చేసి రూ. 613 వద్ద ముగిసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా, మారుతీ, భారతీ, ఐటీసీ, సెసాస్టెరిలైట్, హీరోమోటో, హెచ్‌డీఎఫ్‌సీ 2-1% మధ్య లాభపడ్డాయి. అయితే హిందాల్కో, సన్ ఫార్మా 2%పైగా నష్టపోయాయి. ఈ బాటలో టాటా పవర్, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, భెల్ 1.5-1% మధ్య డీలాపడ్డాయి. ఇక యథాప్రకారం చిన్న షేర ్లకు డిమాండ్ కొనసాగింది. ట్రేడైన షేర్లలో 1,742 పురోగమిస్తే, 1,312 నష్టపోయాయి. ఇక గురువారం రూ. 434 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా రూ. 183 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement