400 పాయింట్లు పతనమైన సెన్సెక్స్

Sensex Nifty Track Global Markets Lower - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాల్లో పప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో  సెన్సెక్స్ ఆరంభంలోనే 400 పాయింట్లు కుప్పకూలింది.  ఫార్మా, టెలీకాం తప్ప బ్యాంకింగ్,‌ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహా ఇతర రంగాలు నెగిటివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 454 పాయింట్ల నష్టంతో 31106 వద్ద, నిఫ్టీ 117 పాయింట్లు కుప్పకూలి 9123 వద్ద కొనసాగుతున్నాయి. కరోనా  వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభం తరువాత పాకక్షికంగా  ప్రత్యేక రైలు సేవలు  ప్రారంభం కావడంతో ఐఆర్‌సీటీసీ కౌంటర్‌ వరుసగా రెండో రోజు కూడా భారీ లాభాలతో కొనసాగుతోంది. 

హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, మారుతి సుజుకి, జీ ఎంటర్‌టైన్‌మెంట్, జెఎస్‌డబ్ల్యు స్టీల్  నష్టపోతుండగా, వేదాంత, ఇండియన్ ఆయిల్, సిప్లా, ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా లాభపడుతున్నాయి. ప్రారంభంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ (2.67 శాతం), హెచ్‌డిఎఫ్‌సి (2.05 శాతం), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.71 శాతం)  నష్టపోయాయి. (రాయితీ రైల్వే టికెట్లు వారికి మాత్రమే!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top