చివర్లో అమ్మకాలు | Sensex ends flat on caution ahead of Budget, derivative expiry | Sakshi
Sakshi News home page

చివర్లో అమ్మకాలు

Feb 26 2015 2:18 AM | Updated on Sep 2 2017 9:54 PM

చివర్లో అమ్మకాలు

చివర్లో అమ్మకాలు

ఫిబ్రవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్‌ల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్రారంభ లాభాలను ముగింపు సమయంలో కోల్పోయాయి.

కొనసాగిన ముందు జాగ్రత్త
ప్రారంభ లాభాలు ఆవిరి
స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీలు
మార్కెట్  అప్‌డేట్

ముంబై: ఫిబ్రవరి డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్‌ల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ప్రారంభ లాభాలను ముగింపు సమయంలో కోల్పోయాయి. బడ్జెట్ నేపథ్యంలో ఇన్వెస్టర్లుగా ఆచితూచి వ్యవహరిస్తున్నారని, దీంతో ఈ వారంలో స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులంటున్నారు.   

బీఎస్‌ఈ సెన్సెక్స్ 29,115 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.  ఒక దశలో  29,270 పాయింట్ల   గరిష్ట స్థాయిని తాకింది. చివరి గంటన్నరలో అమ్మకాల ఒత్తిడికి లాభాలన్నీ హరించుకుపోయాయి.  చివరకు 3 పాయింట్ల లాభంతో 28,968 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 8,767 పాయింట్ల వద్ద ముగిసింది.
 
మిశ్రమంగా రైల్ షేర్లు : మహీంద్రా గ్రూప్ మెజారిటీ వాటా కొనుగోలు చేయనున్నదన్న వార్తల నేపథ్యంలో ఏబీజీ షిప్‌యార్డ్ షేర్ 15 శాతం వరకూ పెరిగిందిజ గురువారం రైల్వే బడ్జెట్ సందర్భంగా రైల్వే షేర్లు మిశ్రమంగా ముగిశాయి.
 
ఐదు ఐపీఓలకు సెబీ ఆమోదం: కాగా ఐదు కంపెనీల ఐపీఓలకు సెబీ ఆమోదం లభించింది. యూనిపార్ట్స్ ఇండియా, వీఆర్‌ఎల్ లాజిస్టిక్స్, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్, ఏసీబీ (ఇండియా), శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్‌లు వీటిలో ఉన్నాయి. ఈ కంపెనీలు ఐపీఓకు సంబంధించిన పత్రాలను గత ఏడాది సెబీకి సమర్పించాయి. గతంలో మార్కెట్ పరిస్థితులు బాగా లేకపోవడంతో పలు కంపెనీలు తమ ఐపీఓ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి.
 
మార్చి 10న యాడ్‌ల్యాబ్స్ ఐపీఓ
న్యూఢిల్లీ: యాడ్‌ల్యాబ్స్ ఎంటర్‌టైన్మెంట్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) వచ్చే నెల 10న ప్రారంభమై 12న ముగుస్తుంది. ఈ సంస్థ ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో యాడ్‌ల్యాబ్స్ ఇమాజిక పేరుతో ఒక ఎమ్యూజ్‌మెంట్ పార్క్‌ను నిర్విహ స్తోంది. ఈ పార్క్‌ను ప్రముఖ చిత్ర నిర్మాత, దర్శకుడు మన్మోహన్ శెట్టి నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement