సెన్సెక్స్ 115 పాయింట్లు ప్లస్ | Sensex 115 points plus | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ 115 పాయింట్లు ప్లస్

Nov 29 2013 1:15 AM | Updated on Sep 2 2017 1:04 AM

సెన్సెక్స్ 115 పాయింట్లు ప్లస్

సెన్సెక్స్ 115 పాయింట్లు ప్లస్

ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు నేపథ్యంలో మార్కెట్లు యథాప్రకారం ఒడిదొడుకులకు లోనయ్యాయి. అయితే రోజులో అత్యధిక సమయం సానుకూలంగానే కదిలాయి.

ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల ముగింపు నేపథ్యంలో మార్కెట్లు యథాప్రకారం ఒడిదొడుకులకు లోనయ్యాయి. అయితే రోజులో అత్యధిక సమయం సానుకూలంగానే కదిలాయి. ఇందుకు ఆసియా, యూరప్ మార్కెట్ల లాభాలు ప్రభావం చూపాయి. వెరసి సెన్సెక్స్ 115 పాయింట్లు లాభపడి 20,535 వద్ద నిలవగా, 35 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ 6,092 వద్ద స్థిరపడింది. అమెరికాలో ఉద్యోగ గణాంకాలు, వినియోగదారుల విశ్వాస సూచీ బలపడటంతో సెంటిమెంట్ మెరుగుపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం(29న) దేశీయ జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. మరోవైపు జర్మనీకి సంబంధించిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత వంటి గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలోనూ యూరప్ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతుండటం గమనార్హం!
 లాభాల్లో క్యాపిటల్ గూడ్స్
 ఇటీవల వెలుగులోకి వచ్చిన క్యాపిటల్ గూడ్స్ రంగం మరోసారి 2% ఎగసింది. అమెరికా తదితర దేశాలతో ఇరాన్ అణుఒప్పందం కుదుర్చుకున్నాక ఈ షేర్లు జోరు  చూపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సుజ్లాన్, వెల్‌స్పన్ కార్ప్, కార్బొరాండమ్, సద్భావ్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ ట్రాన్స్‌పోర్ట్, క్రాంప్టన్ గ్రీవ్స్, సీమెన్స్, ఏబీబీ, భెల్, పుంజ్ లాయిడ్, ఎల్‌అండ్‌టీ 9-2% మధ్య దూసుకెళ్లాయి. ఇక సెన్సెక్స్‌లో హిందాల్కో, ఎంఅండ్‌ఎం, కోల్ ఇండియా, జిందాల్, టాటా స్టీల్, ఆర్‌ఐఎల్, హెచ్‌యూఎల్ 2.4-1% మధ్య లాభపడ్డాయి. ఎఫ్‌ఐఐలు రూ. 103 కోట్లు, దేశీయ ఫండ్స్ రూ. 331 కోట్లు చొప్పున ఇన్వెస్ట్ చేశాయి.
 చిన్న షేర్లు ఓకే
 మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు దాదాపు 1% స్థాయిలో బలపడ్డాయి. ట్రేడైన షేర్లలో 1,442 లాభపడగా, 1,032 నష్టపోయాయి. మిడ్ క్యాప్స్‌లో వోల్టాస్ 12% జంప్‌చేయగా, పెనిన్సులార్, కోరమాండల్ ఇంటర్నేషనల్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, డిష్ టీవీ, టాటా ఎలక్సీ, జేపీ అసోసియేట్స్, బాంబే డయింగ్, బ్లూస్టార్ 10-6% మధ్య పురోగమించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement