మాల్యాకు మరో షాక్‌!

Sebi Bars Vijay Mallya From Securities Market For 3 Years - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:   వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి లండన్‌కు చెక్కేసిన    వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు సెబీ గట్టి షాక్‌ ఇచ్చింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మాల్యాపై  నిషేధాన్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్టాక్‌మార్కెట్లనుంచి  మరో   మూడేళ్ల పాటు నిషేధించింది. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్‌నుంచి అక్రమంగానిధులను మళ్లించిన ఈ నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. అలాగే   లిస్టింగ్‌ కంపెనీలో డైరెక్టర్‌గా కొనసాగకుండా మరో ఐదేళ్లపాటు నిషేధించింది.  మాల్యాతో  పాటు  కంపెనీ మాజీ అధికారులు అశోక్ కపూర్, పిఎ మురళిపై  ఒకసంవత్సరం బ్యాన్‌ విధించింది. అక్రమ లావాదేవీల  వ్యవహారంలో చర్యల నిమిత్తం ఈ నిర్ణయం తీసుకున్నామని సెబీ  పూర్తికాలపు సభ్యులు జీ మహాలింగం  వెల్లడించారు.

జనవరి 2017 లో తాత్కాలిక ఆర్డర్ ద్వారా, అక్రమ లావాదేవీలకు సంబంధించిన కేసులో సెక్యూరిటీస్ మార్కెట్ల నుంచి మాల్యా,  కపూర్‌, మురళి సహా యునైటెడ్ స్పిరిట్స్‌కు చెందిన ఆరుగురిపై మూడేళ్లపాటు  నిషేధం విధించింది.   మరోవైపు ఫార్ములా వన్‌ మోటార్‌ స్పోర్ట్‌ కంపెనీ ఫోర్స్‌ ఇండియా డైరెక్టర్‌ పదవికి   మాల్యా రాజీనామా చేశారు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు, విచారణ నేపథ్యంలో కంపెనీకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు  చెప్పారు. తన కుమారుడు సిద్ధార్థ్‌ మాల్యా ‘ఫోర్సు ఇండియా’ డైరెక్టర్‌ పదవి చేపట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు  మాల్యా పేర్కొన్న సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top