స్వల్పంగా తగ్గిన ఎస్బీఐ రుణ రేటు | SBI revises minimum lending rate by 5 bps to 9.15% | Sakshi
Sakshi News home page

స్వల్పంగా తగ్గిన ఎస్బీఐ రుణ రేటు

May 3 2016 1:09 AM | Updated on Oct 9 2018 2:28 PM

స్వల్పంగా తగ్గిన ఎస్బీఐ రుణ రేటు - Sakshi

స్వల్పంగా తగ్గిన ఎస్బీఐ రుణ రేటు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది.

5 బేసిస్ పాయింట్లు తగ్గింపుతో 9.15%కి
ముంబై: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారిత రుణ రేటును స్వల్పంగా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీనితో ఈ రేటు 9.20 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గింది. దీనివల్ల  మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్‌కు అనుసంధానమయ్యే రుణ రేట్లు ఆ మేరకు తగ్గనున్నాయి. మే 1వ తేదీ నుంచి తాజా రేటు అమల్లోకి వస్తుందని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. తాజా తగ్గింపు ప్రకారం...  ఎస్‌బీఐ ప్రకటన ప్రకారం... మహిళా కస్టమర్లు మినహా మిగిలిన వారికి ఈ స్థిర రేటు 9.40 శాతంగా ఉంటుంది.

మహిళా కస్టమర్ల విషయంలో  ఈ రుణ రేటు 9.35 శాతంగా ఉంది. కారు రుణ రేటు కూడా ఐదు బేసిస్ పాయింట్లు తగ్గుతుంది. ఏప్రిల్ 30వ తేదీ వరకూ మినహాయించిన కారు రుణ ప్రాసెసింగ్ ఫీజు రూ.500ను బ్యాంక్ మళ్లీ అమల్లోకి తీసుకువచ్చింది. ఎన్‌ఆర్‌ఐ కార్ లోన్స్, ఎస్‌బీఐ కాంబో రుణ పథకం, ఎస్‌బీఐ లాయల్టీ కార్ లోన్ స్కీమ్‌లకు తాజా నిర్ణయం వర్తిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement