వ్యాపార అవకాశాలకు ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఒప్పందం | SBI inks pact with Bank of China for business opportunities | Sakshi
Sakshi News home page

వ్యాపార అవకాశాలకు ఎస్‌బీఐ, బ్యాంక్‌ ఆఫ్‌ చైనా ఒప్పందం

Mar 20 2019 1:23 AM | Updated on Mar 20 2019 1:23 AM

 SBI inks pact with Bank of China for business opportunities - Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వ్యాపార అవకాశాల విస్తృతికి పరస్పర సహకారం లక్ష్యంగా భారత్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ), చైనా బ్యాంకింగ్‌ దిగ్గజం, మూలధనం పరిమాణం పరంగా ప్రపంచంలో మూడవ అతిపెద్ద బ్యాంక్‌–  బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (బీఓసీ) లు చేతులు కలిపాయి. ఈ మేరకు ఒక అవగహనా పత్రం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి.

ఈ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా అంతర్జాతీయంగా తమతమ మార్కెట్ల విస్తృతికి రెండు బ్యాంకులూ వేర్వేరుగానూ తమ కార్యకలాపాలను నిర్వహించే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అయితే ఈ ఒప్పందం వల్ల రెండు బ్యాంకుల క్లయింట్లకూ నెట్‌వర్క్‌ విస్తృతమవుతుంది. విస్తృత స్థాయిలో సేవలనూ పొందవచ్చు.  ప్రస్తుతం ఎస్‌బీఐకి షాంఘైలో బ్రాంచీ ఉండగా, ముంబైలో బీఓసీ తన బ్రాంచీని విస్తృతం చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement