రెడ్‌మికి షాక్‌ : బడ్జెట్‌ ధరలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌

Samsung launches Galaxy A2 Core for Rs 5,290; to take on Xiaomi Redmi Go in India - Sakshi

షావోమి పోటీగా  గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో

గెలాక్సీ ఏ 2 కోర్‌: రూ.5290

సాక్షి, న్యూఢిల్లీ :  సౌత్‌ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌  బడ్జెట్‌ ధరలో కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను  భారత మార్కెట్లో విడుదల  చేసింది. ప్రధానంగా చైనా మొబైల్‌  తయారీదారు షావోమి తీసుకొచ్చిన బడ్జెట్‌  ఫోన్‌ రెడ్‌మిగో కి  పోటీగా  ఈ డివైస్‌ను లాంచ్‌ చేసింది.  గెలాక్సీ ఏ2 కోర్‌ పేరుతో , ఆండ్రాయిడ్‌ గో ఆధారిత  స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్‌ ఆవిష్కరించింది. దీని ధర 5290  రూపాయలు గా నిర్ణయించింది.  

 గెలాక్సీ ఏ2 కోర్‌ ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
960x540 పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ 
1. 6 ఆక్టాకోర్ ప్రాసెసర్‌,  7870 సాక్‌
1జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌
256 దాకా విస్తరించుకునే అవకాశం
5 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2600 ఎంఏహెచ్‌ బ్యాటరీ

కాగా షావోమి తీసుకొచ్చిన రెడ్‌మి గో ధర రూ. 4499.  అలాగే రెడ్‌మి గో లో 8 ఎంపీ రియర్‌ కెమెరాను పొందుపర్చగా, బ్యాటరీ  సామర్ధ్యం 3000 ఎంఏహెచ్‌ గా ఉంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Taboola - Feed

Back to Top