న్యూ ఇయర్‌లో రూపాయి మెరుపులు

Rupee (INR) Surges To 5-Month High Vs US Dollar (USD) Today - Sakshi

సాక్షి, ముంబై: కొత్త  ఏడాది ఆరంభంలో ఈక్విటీ మార్కెట్లు నిరాశ పరిస్తే దేశీయ కరెన్సీ మాత్రం ఉత్తేజాన్ని ఇచ్చింది. డాలర్‌ మారకంలో రుపీ  సుమారు 5 నెలల గరిష్టాన్ని తాకింది.   డాలర్‌తో పోలిస్తే 63.65  స్థాయిని నమోదు చేసింది.  ఆగస్టు, 2017 తరువాత ఈ స్థాయిని తాకింది.  అంతేకాదు 2018 సంవత్సరంలో రూపాయి విలువ మరింత పుంజుకుంటుందని ఎనలిస్టులు పేర్కొనడం విశేషం.

డాలర్ మారకంతో రూపాయి మారకం విలువ డాలర్తో పోల్చుకుంటే రూపాయి ఐదు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. శుక్రవారం 21 పైసలు పెరిగి 63.87 వద్ద ముగిసింది . కాగా సోమవారం  41 పైసలు ఎగిసి  63.63  స్థాయిని టచ్‌ చేసింది.

అమెరికన్ కరెన్సీ డాలర్‌లో బ్యాంకర్లు, ఎగుమతిదారులు  భారీ అమ్మకాలు  తదితర కారణాలు  దేశీయ కరెన్సీకి సానుకూలంగా మారాయని నిపుణుల అంచనా. అటు దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి రూపాయికి మద్దతు లభించింది. బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ భారీ నష్టాల్లో ముగిసినప్పటికీ మార్కెట్లు స్థిరంగా  ఉండడం రూపాయికి లాభించింది.   2017లో రూపాయి  6శాతం ఎగిసింది. అలాగే డాలర్ కూడా ఇతర గ్లోబల్ కరెన్సీలతో పోలిస్తే లాభాలనే గడించింది. మరోవైపు  2018 మొదటి త్రైమాసికంలో రూపాయి 63 స్థాయికి చేరుతుందని ఫారెక్స్ సలహా సంస్థ ఐఎఫ్ఎ గ్లోబల్ పేర్కొంది.  2018 సంవత్సరం రూపాయికి సానుకూలంగా ఉండనుందని ఫారెక్స్  ఎడ్వైజరీ సంస్థ తెలిపింది.
 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top