స్టాక్‌ మార్కెట్‌కు బడ్జెట్‌ షాక్‌

Rs Five Lac Crore Equity Investors Wealth Wiped Out - Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్‌పై కేంద్ర బడ్జెట్‌ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బడ్జెట్‌ మార్కెట్‌ను మెప్పించడంలో విఫలమవడంతో మదుపుదారులు అమ్మకాలకు తెగబడ్డారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు కొనసాగడంతో సోమవారం కీలక సూచీలు భారీగా పతనమయ్యాయి. విదేశీ ఇన్వెస్టర్లకు దీర్ఘకాల మూలధన రాబడిపై పన్నును పెంచడం ఎఫ్‌పీఐలను తీవ్ర నిరాశకు లోనుచేసిందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి.

అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 700 పాయింట్ల నష్టంతో 38,816 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  నిఫ్టీ 215 పాయింట్ల నష్టంతో 11,595 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. గత రెండు సెషన్‌లలో స్టాక్‌ మార్కెట్ల భారీ నష్టాలతో మదుపుదారుల సంపద రూ 5 లక్షల కోట్ల మేర ఆవిరైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top