ఆర్‌ఐఎల్‌ అరుదైన ఘనత

RIL Becomes First Indian Company To Hit Rs Ten Lakh Crore Market Cap - Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్లు సరికొత్త శిఖరాలకు చేరడంతో ముఖేష్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ (ఆర్‌ఐఎల్‌) మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ 10 లక్షల కోట్లకు చేరి ఈ ఘనత సాధించిన తొలి భారత కంపెనీగా సత్తా చాటింది. గురువారం ఉదయం పది గంటలకు ఆర్‌ఐఎల్‌ షేర్‌ రూ 1579కు చేరగానే అదేసమయంలో కంపెనీ షేర్ల మొత్తం మార్కెట్‌ విలువ రూ 10 లక్షల కోట్లు పలికింది. ఈ ఏడాది ఆర్‌ఐఎల్‌ షేర్‌ 41 శాతం పెరగ్గా, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ కేవలం 12 శాతం పైగా లాభపడింది. ఈ ఏడాది అక్టోబర్‌ 18న ఆర్‌ఐల్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ 9 లక్షల కోట్లకు చేరగా మరో నెలలోనే మరో రూ లక్ష కోట్ల మేర తన విలువను పెంచుకోగలిగింది. రూ 7.81 లక్షల కోట్లతో ఆర్‌ఐఎల్‌ తర్వాత టీసీఎస్‌ రెండో అతిపెద్ద మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ కలిగిన కంపెనీగా నమోదైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top