విమానాల రాకపోకల వేళలు, ఇతర డెవలప్‌మెంట్స్‌ను ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా
హైదరాబాద్: విమానాల రాకపోకల వేళలు, ఇతర డెవలప్‌మెంట్స్‌ను ట్విట్టర్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ద్వారా కూడా తెలియపర్చనున్నట్లు శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(ఆర్‌జీఐఏ) నిర్వహిస్తున్న జీఎంఆర్ సంస్థ తెలిపింది. విమానాల రాకపోకలు, విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న ప్రత్యేక ఆఫర్లు, రిటైల్ ఆప్షన్లు, ఫుడ్ అండ్ బ్రీవరేజ్ సర్వీసులు, డ్యూటీ ఫ్రీ దుకాణాల సమాచారం ఇక నుంచి సోషల్ మీడియాలో అందుబాటులోకి రానుంది. ఫేస్‌బుక్‌లో ఆర్‌జీఐఏ సమాచారం పొందాలనుకునేవారు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.ఫేస్‌బుక్.కామ్/హైదరాబాద్‌ఎయిర్‌పోర్ట్, ట్విట్టర్‌లో.. ట్విట్టర్.కామ్/ఆర్‌జీఏఏహెచ్‌వైడి, యూట్యూబ్‌లో.. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.యూట్యూబ్.కామ్/యూజర్/ఆర్‌జీ ఐఏహైదరాబాద్ లో సంప్రదించాలని జీఎంఆర్ సంస్థ ఒకప్రకటనలో తెలిపింది.