కీలక ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో ఎఫ్‌డీఐలపై సమీక్ష

Review of FDIs in Infra Projects - Sakshi

న్యూఢిల్లీ: వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో టెలికంతోపాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)పై కేంద్రం దృష్టి సారించింది. వ్యూహాత్మక ప్రాంతాలు, సరిహద్దుల్లో వివిధ ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడులపై ప్రభుత్వం సమగ్ర సమీక్ష ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐతో పాటు వివిధ శాఖలు, ఏజెన్సీలు ఈ కసరత్తులో పాల్గొంటున్నట్లు వివరించాయి. ప్రస్తుతం చాలామటుకు పరిశ్రమల్లో ఆటోమేటిక్‌ పద్ధతిలో ఎఫ్‌డీఐలకు అనుమతులు ఉన్నాయి. అయితే, ఈశాన్య రాష్ట్రాలు సహా కీలకమైన ప్రాంతాల్లోని ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో విదేశీ పెట్టుబడులను అనుమతించడం ఎంత వరకూ శ్రేయస్కరమన్నది కేంద్రం పరిశీలిస్తోంది. సాధారణంగా చాలా మటుకు దేశాలు వ్యూహాత్మక ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో విదేశీ సంస్థలకు అనుమతులివ్వవు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top