ఈ కారుపై లక్ష వరకు ధర తగ్గింపు | Renault cuts Duster prices by up to 1 lakh | Sakshi
Sakshi News home page

ఈ కారుపై లక్ష రూపాయల వరకు ధర తగ్గింపు

Mar 1 2018 6:02 PM | Updated on Jul 6 2019 3:18 PM

Renault cuts Duster prices by up to 1 lakh - Sakshi

ఆటోమేకర్‌ రెనాల్ట్‌ ఇండియా తన ఎస్‌యూవీ డస్టర్‌పై భారీగా ధర తగ్గించింది. ఈ కారుపై 29,746 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ధర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ధర తగ్గింపు అమల్లోకి వస్తుందని గురువారం రెనాల్ట్‌ ఇండియా తెలిపింది. 

ధర తగ్గింపు అనంతరం పెట్రోల్‌తో నడిచే డస్టర్‌ ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో 7.95 లక్షల రూపాయల నుంచి 9.95 లక్షల రూపాయల వరకు ఉంది. అంతకముందు ఇది 8.5 లక్షల రూపాయల నుంచి 10.24 లక్షల రూపాయలకు లభ్యమయ్యేది.  డీజిల్‌తో నడిచే డస్టర్‌ ప్రస్తుతం ఎక్స్‌షోరూంలో రూ.8.95 లక్షల నుంచి రూ.12.79 లక్షలకు అందుబాటులోకి వచ్చింది. దీని ధర కూడా అంతకముందు 9.45 లక్షల రూపాయల నుంచి 13.79 లక్షల రూపాయల వరకు ఉండేది. 

తాము ఆఫర్‌ చేసే వాహనాల రేంజ్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చడం కోసం, కొత్త డస్టర్‌ కస్టమర్లకు ఈ ప్రయోజనాలను అందించడం తమకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని రెనాల్ట్‌ ఇండియా ఆపరేషన్స్‌ దేశీయ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమిత్ సావ్నీ తెలిపారు. హ్యుందాయ్‌ క్రిటా, మారుతీ విటారా బ్రిజా, ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ వంటి ఎస్‌యూవీలకు డస్టర్‌ గట్టి పోటీగా ఉంది. చెన్నైలో ఉన్న తయారీ యూనిట్‌ నుంచి ఈ డస్టర్‌ను రెనాల్ట్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement