జియో యూజర్లకు తీపికబురు | Reliance Jio Prime membership extended | Sakshi
Sakshi News home page

జియో ప్రైమ్‌ సభ్యత్వం.. మరో ఏడాది ఉచితం

Mar 31 2018 2:09 AM | Updated on Mar 31 2018 11:56 AM

Reliance Jio Prime membership extended - Sakshi

న్యూఢిల్లీ: జియో యూజర్లకు తీపికబురు. రిలయన్స్‌ జియో తాజాగా జియో ప్రైమ్‌ సభ్యత్వాన్ని పొడిగించింది. మరో ఏడాదిపాటు ప్రైమ్‌ సర్వీసులను ఉచితంగా పొందొచ్చని పేర్కొంది. దీని కోసం యూజర్లు మైజియో యాప్‌లోకి వెళ్లి కాంప్లిమెంటరీ మెంబర్‌షిప్‌ కోసం రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపింది.

మామూలుగా అయితే జియో ప్రైమ్‌ సభ్యత్వం గడువు మార్చి 31తో ముగుస్తుంది. ఇక కొత్త యూజర్లు రూ.99ల వార్షిక సభ్యత్వ ఫీజుతో ప్రైమ్‌ బెనిఫిట్స్‌ను పొందొచ్చని కంపెనీ తెలిపింది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగినవారు లైవ్‌ టీవీ ఛానళ్లు, సినిమాలు, వీడియోలు, పాటలు, మ్యాగజైన్స్‌ సంబంధిత కంటెంట్‌ను ఉచితంగా యాక్సెస్‌ చేయవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement