
బార్సెలోనా: రిలయన్స్ జియో వచ్చే దీపావళి నాటికి దేశంలోని 99 శాతం ప్రజలకు సేవలు అందించే స్థితికి చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది. ఈ విషయాన్ని జియో ఇన్ఫోకామ్ ప్రెసిడెంట్ జ్యోతింద్ర థాకర్ తెలిపారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా శామ్‌సంగ్ భాగస్వామ్యంతో కలసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సేవలను అందించాలనుకుంటున్నట్టు, ఇది కస్టమర్లు, వ్యాపారులకు సాయంగా ఉంటుందన్నారు.
ప్రతీ నెలా 8,000 నుంచి 10,000 వరకు టవర్లను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి దేశంలో 99 శాతం ప్రాంతాలను కవర్ చేయగలమన్నారు. ప్రస్తుతం జియోకి 16 కోట్ల టెలికం చందాదారులు ఉన్నారు.