రిలయన్స్ మల్టీప్లెక్స్ వ్యాపార విక్రయం పూర్తి | Reliance completed the sale of the multiplex business | Sakshi
Sakshi News home page

రిలయన్స్ మల్టీప్లెక్స్ వ్యాపార విక్రయం పూర్తి

Aug 5 2015 12:34 AM | Updated on Sep 3 2017 6:46 AM

రిలయన్స్ మల్టీప్లెక్స్ వ్యాపార విక్రయం పూర్తి

రిలయన్స్ మల్టీప్లెక్స్ వ్యాపార విక్రయం పూర్తి

అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ మీడియా వర్క్స్ తమ మల్టీప్లెక్స్ వ్యాపార విక్రయ ప్రక్రియ పూర్తయినట్లు మంగళవారం తెలిపింది...

ముంబై: అనిల్ అంబానీ గ్రూప్‌నకు చెందిన రిలయన్స్ మీడియా వర్క్స్ తమ మల్టీప్లెక్స్ వ్యాపార విక్రయ ప్రక్రియ పూర్తయినట్లు మంగళవారం తెలిపింది. దీని వల్ల మాతృసంస్థకు రూ. 700 కోట్ల రుణ భారం తగ్గుతుందని వివరించింది. మరోవైపు రియల్ ఎస్టేట్‌ను కూడా రూ. 200 కోట్లకు విక్రయించేందుకు చర్చలు జరుగుతున్నాయని కంపెనీ మాతృసంస్థ రిలయన్స్ క్యాపిటల్ పేర్కొంది. గతేడాది డిసెంబర్‌లో కార్నివాల్ సినిమాస్‌కు రిలయన్స్ మీడియా వర్క్స్ తమ మల్టీప్లెక్స్ వ్యాపారాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. అప్పట్లో సంస్థకు బిగ్ సినిమాస్ పేరిట దాదాపు 250 స్క్రీన్స్ ఉండేవి. ఈ డీల్ ఫలితంగా 300 పైచిలుకు స్క్రీన్స్‌తో దేశంలోనే మూడో అతి పెద్ద మల్టీప్లెక్స్ ఆపరేటర్‌గా కార్నివాల్ నిల్చింది.

Advertisement
 
Advertisement
Advertisement