రెడ్‌మి నోట్‌ 7 లాంచింగ్‌ ఈ నెలలోనే

Redmi Note 7 India Launch Date Confirmed on February 28 - Sakshi

సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి  తన నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 భార‌త్ లో విడుద‌లపై  క్లారిటీ ఇచ్చింది. ఎప్పటినుంచో స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎదురు చూస్తున్న   ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవవరి 28న ఆవిష్కరించన్నుట్టు   అధికారిక ట్విటర్లో    షావోమి ప్రకటించింది. ఇప్పటికే చైనా మార్కెట్లో  మిలియన్‌ అమ్మకాలతో దూసుకుపోతోంది.

రెడ్‌ మి నోట్‌ 7 లో 48 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న భారీ కెమెరాను అమర్చగా  మూడు వేరియంట్లలో బ్లాక్‌, బ్లూ, ప‌ర్పుల్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో లభించనుంది. 3 జీబీ/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌  రూ.10,390 ధ‌ర‌కు ల‌భ్యం కానుంని తెలుస్తోంది.  4జీబీ/64జీబీ స్టోరేజ్‌ ధర  రూ. 12,460,  6జీబీ/64జీబీ స్టోరేజ్‌ ధర  రూ.14,540లుగా ఉండనుందని అంచనా.

రెడ్‌మీ నోట్ 7 ఫీచ‌ర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
క్వాల్కం స్నాప్‌డ్రాగ‌న్ 660 సాక్‌ ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 9.0 పై
3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 
256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
48+5 ఎంపీ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరా
13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top