లీకైన రెడ్‌మి కే 20 సిరీస్‌.. ఫీచర్లు ఇవే..! | Redmi K Series Full Specifications Sheet Leaks Online | Sakshi
Sakshi News home page

లీకైన రెడ్‌మి కే 20 సిరీస్‌.. ఫీచర్లు ఇవే..!

May 22 2019 6:52 PM | Updated on May 22 2019 7:55 PM

Redmi K Series Full Specifications Sheet Leaks Online - Sakshi

రెడ్‌మి కే 20 సిరీస్‌ ఫీచర్లు ఇవే..

బీజింగ్‌ : దిగ్గజ మొబైల్‌ బ్రాండ్‌ షియోమి రెడ్‌మి అత్యాధునిక ఫీచర్లతో కే20, కే20 ప్రో డివైజ్‌లను ఈనెల 28న చైనా మార్కెట్‌లో లాంఛ్‌ చేయనుంది. లాంఛ్‌కు ముందే ఈ రెండు ప్రోడక్ట్‌ల ఫుల్‌ స్పెసిఫికేషన్‌ షీట్‌ ఆన్‌లైన్‌లో లీకై హల్‌చల్‌ చేస్తోంది. మరోవైపు భారత మార్కెట్‌లో రెడ్‌మి కే20 సిరీస్‌ను త్వరలో లాంఛ్‌ చేస్తామని షియోమి ఇండియా ప్రకటించింది.

ఇక లీకైన స్పెసిఫికేషన్‌ షీట్‌ ప్రకారం రెడ్‌మి కే20 స్నాప్‌డ్రాగన్‌ 700 చిప్‌సెట్‌తో రానుండగా కే20 ప్రొ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్రాసెసర్‌తో రానుంది. రెండు ఫోన్లు 2340=1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌తో 6.39 ఇంచ్‌ ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ కలిగిఉంటాయి.  ఫ్లేమ్‌ రెడ్‌, గ్లేసియర్‌ బ్లూ, కార్బన్‌ ఫైబర్‌ బ్లాక్‌ రంగుల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. రెడ్‌మి కే20 6జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ కాగా, కే20 ప్రో 8 జీబ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌తో లభించనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement