విద్యార్థులకు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు | RBI quiz competitions for students | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు

Aug 6 2014 1:14 AM | Updated on Sep 2 2017 11:25 AM

విద్యార్థులకు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు

విద్యార్థులకు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు

సీనియర్ స్యూల్ విద్యార్థులకు ఆర్‌బీఐ క్యూ 2014 పేరుతో క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు ఇక్కడి రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం తెలిపింది.

న్యూఢిల్లీ: సీనియర్ స్యూల్ విద్యార్థులకు ఆర్‌బీఐక్యూ 2014 పేరుతో క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు ఇక్కడి రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం తెలిపింది. పోటీలను దేశవ్యాప్తంగా ఈ నెల 6,8, 27వ తేదీలలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 9-12 తరగతుల ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్ల విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చునని పేర్కొంది.

 తొలి దశలో గెలుపొందిన టీమ్‌లను జోనల్ ఫైనల్స్‌కు, ఆపై నేషనల్ ఫైనల్స్‌కు ఎంపిక చేయనున్నట్లు వివరించింది. ఈ క్విజ్‌లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలలో రిజర్వ్ బ్యాంక్ పాత్ర, చరిత్రలతోపాటు, ఆర్థిక విషయాలు, కరెంట్ అఫైర్స్, దేశ పురోభివృద్ధికి సహకరించిన వ్యక్తులు, సంఘటనలు వంటి అంశాలపై అవగాహన కల్పించనుంది. ఇతర వివరాలను www.rbi.org.in చూడొచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement