కొత్త కుబేరుడు బెజోస్‌ పడిపోయారు | Pune Man Jokes His Amazon Order Made Jeff Bezos Lose World's Richest Tag | Sakshi
Sakshi News home page

కొత్త కుబేరుడు బెజోస్‌ పడిపోయారు

Jul 28 2017 7:44 PM | Updated on Jul 26 2018 1:02 PM

కొత్త కుబేరుడు బెజోస్‌ పడిపోయారు - Sakshi

కొత్త కుబేరుడు బెజోస్‌ పడిపోయారు

ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ను దాటేసి, ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానానికి ఎదిగిన అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ పడిపోయారు.

న్యూడిల్లీ : ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ను దాటేసి, ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానానికి ఎదిగిన అమెజాన్‌ ఫౌండర్‌ జెఫ్‌ బెజోస్‌ పడిపోయారు. ప్రపంచ కుబేరుడిగా నెంబర్‌ 1 టైటిల్‌ను దక్కించుకుని, వెంటనే దాన్ని కోల్పోయారు. అమెజాన్‌ శుక్రవారం ప్రకటించిన జూన్‌ క్వార్టర్‌ ఫలితాలు భారీగా దెబ్బకొట్టడంతో, ఆయనకి ఈ పరిస్థితి ఎదురైంది. ఫలితాల్లో కంపెనీ లాభాలు 77 శాతం మేర పడిపోవడంతో, షేర్లు కూడా ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో బెజోస్‌ సంపద 6 బిలియన్‌ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. అమెజాన్‌లో బెజోస్‌కు 16 శాతం మేర అంటే 80 మిలియన్‌ షేర్లున్నాయి. గురువారం మార్కెట్‌ ప్రారంభంలో అమెజాన్‌ షేర్లు దూసుకుపోవడంతో బెజోస్‌, బిల్‌గేట్స్‌ను దాటేసి, ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు. కానీ నేటి ట్రేడింగ్‌లో షేర్లు అతలాకుతలం అవడంతో, ఆయన కూడా ఆ టైటిల్‌ను వదులుకోవాల్సి వచ్చింది. బెజెస్‌ కొన్ని గంటల్లోనే నెంబర్‌ 2 స్పాట్‌కు పడిపోవడంతో, పుణేకు చెందిన ఫెబిన్ బెంజమిన్ అనే వ్యక్తి సోషల్‌ మీడియాలో ఓ ఫన్నీ పోస్టు పెట్టాడు.
 
ఆ పోస్టుకు విపరీతమైన లైక్స్‌, షేర్ల వెల్లువ కొనసాగుతోంది. '' హయ్‌ అమెజాన్‌, ఒక ప్రొడక్ట్‌ను నేను ఆర్డర్‌ చేశాను. వెంటనే జెఫ్‌ బెజోస్‌ ప్రపంచ కుబేరుడిగా నిలిచినట్టు వార్తవచ్చింది. కొంత సమయం తర్వాత నా ఆలోచన మారి, ఆర్డర్‌ను క్యాన్సిల్‌ చేశాను. అంతే వెంటనే జెఫ్‌ బెజోస్‌ మళ్లీ రెండో స్థానానికి పడిపోయినట్టు వార్త వచ్చింది. ఒక్కసారి చెక్‌ చేస్తారా? నా ఆర్డర్‌ క్యాన్సిలేషన్‌ వల్లే ఇదంతా జరిగిందని?'' అని పోస్టు చేశాడు. అంతే ఈ పోస్టుకు ఒక్కసారిగా వైరల్‌ అయింది. 3వేలకు పైగా షేర్లు వచ్చాయి. కానీ తాను 1000కి పైగా లైక్స్‌ వస్తాయని ఊహించలేదని ఫెబిన్‌ బెజామిన్‌ చెబుతున్నాడు. తన పోస్టుకు 4వేలకు పైగా కామెంట్లను తాకుతుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు. అమెజాన్‌ నుంచి ఇప్పుడే తాను విండోస్‌ 10 కొన్నానని, ప్రస్తుతం ఇక ఎవరు ధనికవంతులవుతారో ఆ దేవుడికి తెలుసని ఫేస్‌బుక్‌ యూజర్‌ చెప్పాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement