breaking news
richest person title
-
నంబర్ వన్ కుబేరుడిగా మళ్లీ ఎలాన్ మస్క్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత సంపన్నుడిగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. దీంతో అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ మళ్లీ రెండోస్థానానికి పరిమితమయ్యారు. మస్క్‌కి చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్ఎక్స్ తాజాగా సెకోయా క్యాపిటల్ తదితర ఇన్వెస్టర్ల నుంచి 850 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించింది. కంపెనీ విలువ 74 బిలియన్ డాలర్లుగా లెక్కగట్టి ఇన్వెస్టర్లు మదుపు చేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ సంపద నికర విలువ 11 బిలియన్ డాలర్లు ఎగిసి.. 199.9 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా ఆయన నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. బెజోస్ సంపద 194.2 బిలియన్ డాలర్లుగా ఉంది. టెస్లా షేర్లు పడిపోవడంతో ఈమధ్యే స్వల్పకాలం పాటు బెజోస్ టాప్ బిలియనీర్‌గా నిల్చారు. -
కొత్త కుబేరుడు బెజోస్ పడిపోయారు
న్యూడిల్లీ : ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను దాటేసి, ప్రపంచ కుబేరుడిగా అగ్రస్థానానికి ఎదిగిన అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ పడిపోయారు. ప్రపంచ కుబేరుడిగా నెంబర్ 1 టైటిల్‌ను దక్కించుకుని, వెంటనే దాన్ని కోల్పోయారు. అమెజాన్ శుక్రవారం ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాలు భారీగా దెబ్బకొట్టడంతో, ఆయనకి ఈ పరిస్థితి ఎదురైంది. ఫలితాల్లో కంపెనీ లాభాలు 77 శాతం మేర పడిపోవడంతో, షేర్లు కూడా ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో బెజోస్ సంపద 6 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. అమెజాన్‌లో బెజోస్‌కు 16 శాతం మేర అంటే 80 మిలియన్ షేర్లున్నాయి. గురువారం మార్కెట్ ప్రారంభంలో అమెజాన్ షేర్లు దూసుకుపోవడంతో బెజోస్, బిల్‌గేట్స్‌ను దాటేసి, ప్రపంచ కుబేరుడిగా ఎదిగారు. కానీ నేటి ట్రేడింగ్‌లో షేర్లు అతలాకుతలం అవడంతో, ఆయన కూడా ఆ టైటిల్‌ను వదులుకోవాల్సి వచ్చింది. బెజెస్ కొన్ని గంటల్లోనే నెంబర్ 2 స్పాట్‌కు పడిపోవడంతో, పుణేకు చెందిన ఫెబిన్ బెంజమిన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ ఫన్నీ పోస్టు పెట్టాడు. ఆ పోస్టుకు విపరీతమైన లైక్స్, షేర్ల వెల్లువ కొనసాగుతోంది. '' హయ్ అమెజాన్, ఒక ప్రొడక్ట్‌ను నేను ఆర్డర్ చేశాను. వెంటనే జెఫ్ బెజోస్ ప్రపంచ కుబేరుడిగా నిలిచినట్టు వార్తవచ్చింది. కొంత సమయం తర్వాత నా ఆలోచన మారి, ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశాను. అంతే వెంటనే జెఫ్ బెజోస్ మళ్లీ రెండో స్థానానికి పడిపోయినట్టు వార్త వచ్చింది. ఒక్కసారి చెక్ చేస్తారా? నా ఆర్డర్ క్యాన్సిలేషన్ వల్లే ఇదంతా జరిగిందని?'' అని పోస్టు చేశాడు. అంతే ఈ పోస్టుకు ఒక్కసారిగా వైరల్ అయింది. 3వేలకు పైగా షేర్లు వచ్చాయి. కానీ తాను 1000కి పైగా లైక్స్ వస్తాయని ఊహించలేదని ఫెబిన్ బెజామిన్ చెబుతున్నాడు. తన పోస్టుకు 4వేలకు పైగా కామెంట్లను తాకుతుందని ఆశిస్తున్నట్టు తెలిపాడు. అమెజాన్ నుంచి ఇప్పుడే తాను విండోస్ 10 కొన్నానని, ప్రస్తుతం ఇక ఎవరు ధనికవంతులవుతారో ఆ దేవుడికి తెలుసని ఫేస్బుక్ యూజర్ చెప్పాడు.