పీఎన్‌బీ రుణ రేట్ల కోత

PSB recap plan insufficient to support lending growth - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ).. మార్జినల్‌ కాస్ట్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను స్వల్పంగా తగ్గించింది. వివిధ కాలపరిమితి గల రుణాలపై వడ్డీరేటును 0.10% తగ్గించింది. సవరించిన రేట్లు మార్చి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.55%నుంచి 8.45%కి తగ్గింది. మూడేళ్ల ఎంసీఎల్‌ఆర్‌ను 8.65%కి కుదిం చింది. అయితే, బేస్‌రేటులో ఎటువంటి మార్పులేదని, 9.25% వద్ద ఈ రేటు యథాతథంగా ఉందని వెల్లడించింది. 

అలహాబాద్‌ బ్యాంకు కూడా...
ప్రభుత్వ రంగ అలాహాబాద్‌ బ్యాంక్‌.. కూడా రుణాలపై ఎంసీఎల్‌ఆర్‌ను 0.10 శాతం తగ్గించింది. మార్చి 1 నుంచి  ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందని బ్యాంకు తెలిపింది. అన్ని రకాల కాల పరిమితులపై ఈ తాజా తగ్గింపు వర్తిస్తుందని స్పష్టంచేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top