పేటీఎం వశమైన రహేజా క్యూబీఈ

Paytm To Acquire General Insurer Raheja QBE - Sakshi

జనరల్‌ ఇన్సూరెన్స్‌లోకి పేటీఎం

ముంబై : పేటీఎం ఆర్థిక సేవలను విస్తరించేందుకు సంస్థ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ ముంబైకి చెందిన ప్రైవేట్‌ రంగ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ రహేజ క్యూబీఈని కొనుగోలు చేయనున్నారు. రహేజ క్యూబీఈలో నూరు శాతం వాటాను పేటీఎం కొనుగోలు చేస్తుందని, ముంబై సహా వివిధ ప్రాంతాల్లో పనిచేసే క్యూబీఈ ఉద్యోగులు యథావిథిగా కొనసాగుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ ఒప్పందం విలువ రూ 568 కోట్లుగా భావిస్తున్నారు. పేటీఎం మాతృసంస్థ ఒన్‌97 రహేజా క్యూబీఈ కొనుగోలును వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది.

పేటీఎం ఆర్థిక సేవల ప్రయాణంలో ఇది కీలక మైలురాయని, పేటీఎం కుటుంబంలోకి రహేజా క్యూబీఈని స్వాగతించేందుకు సిద్ధంగా ఉన్నామని పేటీఎం ప్రెసిడెంట్‌ అమిత్‌ నయ్యర్‌ పేర్కొన్నారు. పటిష్టమైన నిర్వహణ బృందం కలిగిన రహేజా క్యూబీఈ కొనుగోలుతో జనరల్‌ ఇన్సూరెన్స్‌ను పెద్దసంఖ్యలో భారతీయుల చెంతకు చేర్చేందుకు తమకు ఉపకరిస్తుందని అన్నారు. రహేజా క్యూబీఈలో ప్రిస్మ్‌ జాన్సన్‌కు 51 శాతం వాటా ఉండగా క్యూబీఈ ఆస్ర్టేలియా 49 శాతం వాటా కలిగిఉంది. చదవండి : జర జాగ్రత్త.. జేబులోకి చొరబడుతున్నారు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top